రాష్ట్రీయం

రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, అక్టోబర్ 20: రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎడాపెడా దోచుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. టీడీపీ నాయకులు రాష్ట్భ్రావృద్ధి నిరోధకులుగా మారారని తీవ్రంగా విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం అనంతపురం నగరంలోని కలెక్టరేట్ ఎదుట రాయలసీమ జిల్లాల ప్రజా ఆవేదన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని అన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగ యువతకు ఉపాధి హామీ అమలులో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తిగా చంద్రబాబును గుర్తించి నరేంద్ర మోదీ చేతులు కలిపారన్నారు. విభజన అనంతరం రాష్ట్భ్రావృద్ధికి ప్రధాని పెద్దమొత్తంలో నిధులు విడుదల చేశారన్నారు. అయితే చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలిపి మోదీ నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపించారు. చంద్రబాబు పాలనపై ప్రజలు ఆవేదన చెందుతున్నారని, బాబు అవినీతి, మోసాలను రాష్టవ్య్రాప్తంగా ప్రజల దృష్టికి తీసుకువస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అమలుచేస్తున్న ప్రజా వ్యతికరేక విధానాలను వివరించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు రాష్టవ్య్రాప్తంగా ధర్నాలు, నిరాహారదీక్షలు చేపడుతున్నామన్నారు. రాష్ట్ర విభజన తరువాత అభివృద్ధి వికేంద్రీకరణ పేరు చెప్పి ఇప్పుడు అమరావతి చుట్టూ అభివృద్ధి చేస్తున్నారని ఆరోపించారు.
రాయసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కన్నా డిమాండ్ చేశారు. రాయలసీమలో చక్కెర ఫ్యాక్టరీలు, పాల కర్మాగారాలు, ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో రూ.700 కోట్ల విలువ చేసే భూమిని అప్పన్నంగా రూ.18 కోట్లకే అప్పగించడం సిగ్గుచేటన్నారు. జన్మభూమి కమిటీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేటాయిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, చంద్రబాబు కుమారుడి అండదండలతో ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతోందని కన్నా అన్నారు. చేనేతలకు సరైన సమయంలో రుణాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా పాలకులు అడ్డుపడుతున్నారన్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పార్టీలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు, సురేష్‌రెడ్డి, ఎంఎస్.పార్థసారథి, కపిలేశ్వరయ్య, కందుల రాజమోహన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.