రాష్ట్రీయం

గ్రామీణాభివృద్ధిలో ఏపీ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 20: దేశం మొత్తంగా గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచింది. కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలో నిర్వహించిన సర్వేలో కర్ణాటకలోని కులిగోడ్ గ్రామం ప్రథమ స్థానం సాధించగా రాష్ట్రంలోని 37 గ్రామాలు మొదటి పది ర్యాంకులను సొంతం చేసుకుని ప్రత్యేకతను చాటాయి. గ్రామీణాభివృద్ధిలో కీలక చోదకాలైన వౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి, సాగునీటి వనరులు, ఆరోగ్యం, పౌష్టికాహారం, మహిళా సాధికారత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా విశే్లషణాత్మక సర్వే నిర్వహిస్తోంది. సుమారు 1.6 లక్షల పంచాయతీల్లో మూడున్నర లక్షల గ్రామాలను ఎంపికచేసి నిర్వహిస్తున్న ఈ సర్వేలో ఏపీలోని గ్రామాలు అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయని స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో రెండుకు మించిన గ్రామాలకు ఒకే ర్యాంక్ లభించింది. మొదటి పది ర్యాంకులలో 97 గ్రామాలకు గాను ఏపీకి చెందిన 37 గ్రామాలు ఉండటం విశేషం. ఈ గ్రామాలన్నింటిలో అంత్యోదయ పథకం అమలులో ఉంది. కేంద్ర మంత్రిత్వశాఖ అధికారుల బృందం ఈ సర్వే నిర్వహిస్తూ ప్రమాణాలకు అనుగుణంగా ఫలితాలు సాధిస్తున్న ఆవాసాలకు ర్యాంకింగ్ ఇస్తున్నారు. కాగా గత ఏడాది అక్టోబర్‌లో 50వేల గ్రామ పంచాయతీలలో ప్రాథమిక సర్వే చేపట్టారు. అదే క్రమంలో ఈ ఏడాది నవంబర్‌లోగా రెండున్నర లక్షల గ్రామాల్లో సర్వే పూర్తిచేయాలని నిర్ణయించారు. ఏపీలోని పలు గ్రామాలు బహుముఖాభివృద్ధిలో ముందున్నాయని సర్వే నిగ్గుతేల్చింది. విద్యుదీకరణ, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా అనేక గ్రామాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని సర్వేలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పర్యవేక్షణ వల్ల గ్రామాలు వౌలిక అభివృద్ధిని సాధిస్తున్నాయనేందుకు ఇదో తార్కాణంగా నిలుస్తోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ పారిశుద్ధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్రజలకు అందుతున్న వౌలిక సదుపాయాలు తదితర అంశాలపై విశే్లషణాత్మక సర్వే కొనసాగిస్తోంది. మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా దేశవ్యాప్తంగా 58శాతం గ్రామాలు ఉన్నట్లు గుర్తించింది. 21 శాతం గ్రామాలు సామాజిక వ్యర్థ నిర్వహణ పద్దతులను కచ్చితంగా అమలు చేస్తున్నాయని, 75 శాతం మంది గృహ వినియోగదారులు ఎల్పీజీ, బయోగ్యాస్ వంటి కాలుష్యరహిత ఇంధన వనరులను వినియోగిస్తున్నారని సర్వే వివరించింది. రాష్ట్రంలో 92 మార్కులతో చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీరామాపురం గ్రామ పంచాయతీ మొదటి పది స్థానాలు సాధించిన 97 గ్రామాల్లో రెండో స్థానం దక్కించుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన పది గ్రామాలు, విశాఖపట్నం జిల్లాకు చెందిన మరో పది గ్రామాలు మొదటి పది ర్యాంక్‌లలో ప్రత్యేకతను చాటుకున్నాయి.