రాష్ట్రీయం

తిత్లీ బాధితులకు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నిబంధనలు సడలించి పరిహారం వరికి హెక్టార్‌కు రూ.20 వేలు మామిడి.. అరటి.. జీడికి రూ.30 వేలు
* పూర్తిగా దెబ్బతిన్న కొబ్బరిచెట్టుకు రూ.15 వందలు * మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు జీవో జారీ

అమరావతి, అక్టోబర్ 20: తిత్లీ తుపాను బాధితులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధనలను సైతం సడలించి నష్టపరిహారాన్ని ప్రకటించింది. ఈ నెల 25లోగా నష్టం అంచనాలు పూర్తయిన వెంటనే పరిహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. పరిహారానికి సంబంధించి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు పంపాల్సిందిగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కలెక్టర్లు, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తుపాను సందర్భంగా మృతిచెందినవారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. నిర్వాసితులు పునరావాస శిబిరాల నుంచి ఇళ్లకు చేరుకున్న వెంటనే కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామాయిలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు కిలో చొప్పున, అరకిలో చక్కెర పంపిణీ చేస్తారు. కాగా మత్స్యకారులు, వంశధార వరద బాధితులకు కుటుంబానికి 50కిలోల బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పింక్ రంగు కార్డు దారులతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరికీ రేషన్ పంపిణీ చేయనున్నారు. వ్యవసాయ పంటల్లో వరి పంట నష్టానికి సంబంధించి హెక్టార్‌కు రూ. 20వేలు చెల్లించనున్నారు. మిగిలిన వ్యవసాయ ఉత్పత్తుల నష్టానికి ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధనలు వర్తిస్తాయి. ఉద్యానవన పంటల్లో అరటి, జీడి, మామిడి పంటలకు హెక్టార్‌కు రూ.30వేలు, కొబ్బరిచెట్టు పూర్తిస్థాయిలో నష్టపోతే చెట్టుకు రూ.15వందలు చెల్లిస్తారు. మామిడి, జీడి, అరటి పంటలు వేసుకునేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద పొలాల్లో పడిపోయిన చెట్లను ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఉచిత ప్రాతిపదికన తొలగిస్తారు. అలాగే తోటల్లో తిరిగి చెట్లను నాటేందుకు మూడేళ్ల కాలపరిమితితో సన్న, చిన్నకారు రైతులకు రూ.40వేలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది.

మత్స్యకారులకు పరిహారం
పడవలు కోల్పోయిన మత్స్యకారులకు లక్ష చొప్పున, మెకనైజ్డ్ బోట్లకు రూ 6లక్షలు, వలకు రూ 10వేలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్యకారులకు 50 శాతం సబ్సిడీతో పడవలకు పరిహారం చెల్లిస్తారు. ధ్వంసమైన రొయ్యల చెరువులకు హెక్టార్‌కు రూ.30వేలు పరిహారం అందిస్తారు. తుపానులో మృతిచెందిన ఎడ్లకు రూ.30వేల చొప్పున, మేకలకు రూ.3వేలు, పశువుల పాకకు రూ.10వేలు, నూతన నిర్మాణాలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్, గోకులం పథకం కింద రెండు పశువులకు రూ లక్ష, నాలుగింటికి లక్షన్నర, ఆరింటికి లక్షా 80వేలు మంజూరు చేస్తారు. పౌల్ట్రీ సెక్టార్‌లో పూర్తిస్థాయిలో దెబ్బతిన్న కోళ్లఫారాలకు రూ.10వేలు, ఫారం కోళ్లకు రూ.150, బ్రాయిలర్ కోళ్లు మృతిచెందితే రూ.75 చొప్పున పరిహారం ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు రూ.10వేల పరిహారంతో పాటు ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద రూ.2.5 లక్షలతో ఇళ్లను నిర్మిస్తారు. షాపులు కోల్పోయిన చిరువ్యాపారులకు రూ.10వేల చొప్పున మంజూరు చేస్తారు. ఇదిలా ఉండగా తుపానుకు దెబ్బతిన్న పరిశ్రమలు, రైస్‌మిల్లులకు సంబంధించి నష్టపరిహారం మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.