రాష్ట్రీయం

త్వరితగతిన విద్యుత్ పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ‘తిత్లీ’ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను త్వరితగతిన పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ట్రాన్స్‌కో చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయానంద్ తెలిపారు. జిల్లాలో విద్యుత్ పునరద్ధరణే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్థేశిత సమయంలో విద్యుత్ సరఫరాకు శాయశక్తులు కృషి చేస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది పది వేల మంది ఉన్నారని సీఎండీ చెప్పారు. శ్రీకాకుళం పట్టణంలోని ఇపిడిసిఎల్ పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయంలో ఆదివారం విలేఖర్ల సమావేశంలో పునరుద్ధరణ చర్యలు వివరించారు. తిత్లీ తుపానుకు ట్రాన్స్‌కో లైన్లతోపాటు డిస్ట్రిబ్యూషన్ లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. అత్యవసర పునరుద్ధరణ కింద పలాస హెచ్‌టి లైన్ 14వ తేదీ నాటికి, ఇచ్చాపురం హెచ్‌టి లైన్ 16వ తేదీకి పునరుద్ధరణ చేశామన్నారు. పవర్‌గ్రిడ్ తీవ్రంగా నష్టపోవడంతో 500 కెవి తాల్చేరు-పోలారు లైన్ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. 18 నాటికి వెయ్యి మెగావాట్ల విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని, అంగోల్-శ్రీకాకుళం-వేమగిరి 765 కెవి లైన్ కూడా దెబ్బతిందని, దానిని 19వ తేదీ నాటికి పునరుద్ధరిస్తామన్నారు. తద్వారా 950 మెగావాట్ల విద్యుత్ సరఫరా సాధ్యమైందని వివరించారు. 400 కెవి శ్రీకాకుళం-గరివిడి లైన్ కూడా తుఫాను ధాటికి దెబ్బతిందని చెప్పారు. విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ విభాగంలో 33/11 కెవి సబ్‌స్టేషన్లు 101 దెబ్బతిన్నాయని, 95 శాతం మేర పూర్తి అయ్యిందన్నారు. టెక్కలి సబ్‌స్టేషన్ దెబ్బతిందన్నారు. 11 కెవి ఫీడర్ల కింద 10,043 స్తంభాలతో సహా 21,437 ఎల్‌టి పోల్స్ ధ్వంసమయ్యాయని విజయానంద్ వివరించారు. 22 నాటికి దాదాపుగా అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరాను చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లులు నవంబర్ నెల వరకు అపరాధ రుసం లేకుండా చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని చెప్పారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వ ఇంధన శాఖ సలహాదారు కె.రంగనాథ పాల్గొన్నారు.