రాష్ట్రీయం

ఎన్టీపీసీలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక (విశాఖ), అక్టోబర్ 21: విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం రావాడ వద్ద ఉన్న సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ)లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీని కారణంగా సింహాద్రి మూడవ 500 మెగావాట్ల యూనిట్‌ను అధికారులు షట్‌డౌన్ చేశారు. దీంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మూడవ యూనిట్‌కు సంబంధించిన టర్బైన్ డివైస్ బాయిలర్ స్పీడ్ పంపు (టిడిబిఎస్‌పి) వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే టిడిబిఎస్‌పి నుండి ఆయిల్ లీక్‌కావడం, లీక్ అయిన ఆయిల్‌పై విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పురవ్వలు పడి మంటలు వ్యాపించి ఉంటాయని అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా మూడవ యూనిట్ కేబుళ్లు, ఇన్స్‌లేషన్ పూర్తిగా కాలిపోయాయ. అయితే అగ్ని ప్రమాదం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సంస్థ పబ్లిక్ రిలేషన్ అధికారి మల్లయ్య తెలిపారు. ఇది స్వల్ప అగ్ని ప్రమాదమని, మంటలను ఎన్టీపీసీ సిఐఎస్‌ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది సకాలంలోనే అదుపులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. మూడవ యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించేందుకు రెండు రోజులు పట్టే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.