రాష్ట్రీయం

100 సీట్లు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ‘ఎన్నికల ప్రచారానికి ఇంకా 45 రోజుల వ్యవధి ఉంది.దీనిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఓటరును తప్పుని సరిగా కలవాలి.ఇక నుంచి ఎవరూ హైదరాబాద్‌లో కనిపించవద్దు’అని పార్టీ అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం 105 మంది అభ్యర్థులతో పాటు ఎన్నికల ఇన్‌చార్జీలుగా వ్యవహరించనున్న ఎంపీలకు ప్రచార వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ‘ఎన్నికల బరిలో ఉన్నవారికి అతి విశ్వాసం పనికిరాదు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ అతి విశ్వాసం వల్లే ఓడిపోయాడు. పకడ్బందీ ప్రణాళికతో చంద్రబాబు బయటపడ్డాడు. అప్పట్లో అక్కడ టీడీపీ అనుసరించిన విధానానే్న ఇక్కడ మనం అనుసరించి విజయాన్ని చేజిక్కించుకుందాం’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ
60 వేల మంది లబ్ధిదారులు ఉన్నారని, ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వచ్చే ఎన్నికల హామీలను ప్రజలోకి తీసుకెళ్లేలా ప్రచారం జరగాలని ఆయన పిలుపునిచ్చారు. అభ్యర్థుల భేటీలో తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాలను అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియాకు వివరించారు. తొలి విడతలో జరిగిన అధినేత కేసీఆర్ సభలన్నీ దక్షిణ తెలంగాణలోని రంగారెడ్డి, సిద్దిపేట (మెదక్), మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోనే జరగడంతో మలి విడత సభలను ఉత్తర తెలంగాణ జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ముందు ప్రకటించిన విధంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కాకుండా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే మలి విడత సభలను నిర్వహించాలని సంకల్పించింది. ఈ సభలకు వరంగల్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టి తదుపరి ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఎన్నికల ట్రెండ్ సెట్ సభలను నిర్వహించాలని సమావేశంలో వచ్చిన సూచనకు అధినేత కేసీఆర్ అంగీకరించినట్టు కడియం శ్రీహరి తెలిపారు. నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి 30 నుంచి 40 నియోజకవర్గాల్లో సభలను పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. సులువుగా గెలిచే సెగ్మెంట్లలో మొదట సభలు నిర్వహించి, టఫ్‌గా భావించే సెగ్మెంట్లలో చివరలో కేసీఆర్ సభలు జరుగుతాయని కడియం శ్రీహరి వెల్లడించారు. వంద సీట్లు గ్యారంటీగా గెలుస్తామన్న ధీమాను అధినేత కేసీఆర్ వ్యక్తం చేశారన్నారు. వంద సీట్లు గెలిచి చరిత్ర సృష్టించాలని, టీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రావడం చారిత్రక అవసరమన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధినేత దిశా నిర్దేశం చేసినట్టు కడియం వివరించారు. తెలంగాణ రాష్ట్రం పట్ల టీఆర్‌ఎస్‌కున్న సోయి ఇతర పార్టీలకు ఉండదన్నారు. తిరిగి టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాల్సిన అవశ్యకతను ప్రజలకు వివరించాలని సూచించారన్నారు. ఇలా ఉండగా పార్టీలో అసమ్మతి అంటూ ఏమి లేదని, అక్కడక్కడా కొన్ని చోట్ల తలెత్తినా ప్రస్తుతం అంతా సర్దుకుందన్నారు. పార్టీ టికెట్లను ఎంతో మంది ఆశిస్తారని, ఒక్కసారి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అతడి విజయానికి అందరు కృషి చేయాల్సిందేన్నారు. ఇంకా ఎక్కడైనా అసమ్మతి ఉంటే సంబంధిత మంత్రి, అభ్యర్థి, నేతలు కూర్చొని పరిష్కరించుకుంటారని కడియం శ్రీహరి వివరించారు. మహాకూటమి అంశం తమ సమావేశంలో ప్రస్తావనకు రాలేదన్నారు. ఇలా ఉండగా అభ్యర్థులకు నియోజకవర్గాల వారీగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన బుక్‌లెట్‌ను సమావేశంలో అందజేశారు.

చిత్రాలు.. తెలంగాణ భవన్‌లో సమావేశానికి హాజరైన తెరాస అభ్యర్థులు
*తెలంగాణ భవన్‌లో ఆదివారం 105 మంది పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్న తెరాస అధినేత కే. చంద్రశేఖరరావు