రాష్ట్రీయం

మలి విడత ప్రచారానికి కాంగ్రెస్ రోడ్‌మ్యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం బైంసా, కామారెడ్డి, చార్మినార్ వద్ద పాల్గొన్న బహిరంగ సభలు విజయవంతం కావడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. రాహుల్ ప్రచారం ముగించుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్ళే ముందు బేగంపేట విమానాశ్రయంలో కొంత సేపు పార్టీ ముఖ్యులతో మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ వరకు తాను మరో నాలుగైదు పర్యాయాలు ప్రచారంలో పాల్గొనేందుకు వస్తానని చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రచారాన్ని మరింత ఉధృతంగా కొనసాగించే విషయమై ఆదివారం టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ కుంతియా, పార్టీ స్టార్ కాంపైనర్, సినీ నటి విజయశాంతి, ఏఐసీసీ ఎస్‌సి సెల్ చైర్మన్ కొప్పుల రాజు, ప్రచార కమిటీ చైర్మన్ భట్టివిక్రమార్క, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెండో విడత ప్రచార షెడ్యూలుపై వారు సుదీర్ఘంగా చర్చించారు. అయితే సోమవారం మరోసారి సమావేశమై రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. పార్టీ నాయకులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో తప్ప మిగతా నియోజకవర్గాల్లో రెండో విడత ప్రచారం చేపట్టాలని భావించారు. పొత్తులో మిత్రపక్షాలకు ఇచ్చే సీట్లలో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని భావించినట్లు సమాచారం. ఈ నెల 27 లేదా 28 తేదీల్లో రాహుల్‌తో కరీంనగర్, వరంగల్‌లో ప్రచారం నిర్వహించేలా కార్యక్రమాన్ని ఖరారు చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఒకటి, రెండు బహిరంగ సభలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్ జరుపుతున్న విజయ రథ యాత్రతో సమన్వయం చేసుకుని రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని ప్రచార కమిటీ నిర్ణయించింది.