రాష్ట్రీయం

గెలుపు తంటా.. ఓటమి చింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 21: తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతోంది. నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాకముందే పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతోంది. శాసనసభను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడమే తరువాయిగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. నవంబర్ రెండవ వారంలో నోటిఫికేషన్ విడుదలైన వెనువెంటనే నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. గతంలో ఏ ఎన్నికలైనా నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి అభ్యర్థులు, నాయకులు ప్రచారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ సారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అందుకు భిన్నంగా కొనసాగుతోంది. టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్తూ.. అన్ని పార్టీల కంటే ముందుగానే ఉమ్మడి మెదక్ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తొమ్మిది సిట్టింగ్ స్థానాలకుగాను ఒక్క అందోల్ నియోజకవర్గం మినహాయిస్తే అన్నింటికీ తాజా మాజీ ఎమ్మెల్యేలను అభ్యర్థులుగా ప్రకటించింది. గజ్వేల్ నియోజకవర్గం నుండి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, సిద్దిపేట నుంచి ఆపద్ధర్మ మంత్రి టీ.హరీష్‌రావు బరిలోకి దిగుతున్నారు. దుబ్బాక సోలిపేట రామలింగారెడ్డి, మెదక్ పద్మా దేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ చిలుముల మదన్‌రెడ్డి, పటన్‌చెరు గూడెం మహీపాల్‌రెడ్డి, సంగారెడ్డి చింతా ప్రభాకర్, నారాయణఖేడ్ భూపాల్‌రెడ్డిలు బరిలోకి దిగుతుండగా అందోల్ నియోజకవర్గం నుండి జర్నలిస్టు నాయకుడు చంటి క్రాంతి కిరణ్ పోటీకి సిద్ధమయ్యారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన జహీరాబాద్ నుండి టీఆర్‌ఎస్ ఎవరిని రంగంలోకి దింపుతుందన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. కాంగ్రెస్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించనే లేదు.
తెలుగుదేశం, సీపీఐ, టీజేసీతో పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో అభ్యర్థులను ప్రకటించడంలో తాత్సారం చేస్తోంది. సంగారెడ్డి, నర్సాపూర్, జహీరాబాద్, అందోల్, గజ్వేల్ నియోజకవర్గాల్లో టికెట్ తమకే గ్యారెంటీ అని భావిస్తున్న నేతలు ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌నే తమ ప్రత్యర్థిగా భావిస్తూ మాటల తూటాలు పేలుతున్నాయ. సంగారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనదైన శైలిలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి హరీష్‌రావు, తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌లను టార్గెట్ చేసుకుని ఆరోపణాస్త్రాలు సంధిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
మెదక్, నారాయణఖేడ్ సెగ్మెంట్లలో గ్రూపులు, పటన్‌చెరులో అనేక మంది ఆశావహులు ఉండటంతో టికెట్ ఎవరికి లభిస్తుందో చెప్పలేని అయోమయం నెలకొంది. టికెట్ లభించిన అభ్యర్థులకు ఎంతమంది నాయకులు గెలుపుకు సహకరిస్తారో చూడా ఊహించలేని ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్టీ మాత్రం జిల్లాలోని దుబ్బాక, అందోల్ నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించడం విశేషం. రంగంలోకి దిగబోతున్న అభ్యర్థులకు గెలుపు తంటాగా అనిపిస్తూనే ఓటమి చింత కూడా వెంటాడుతోంది. ఏ గ్రామంలో ఏ నాయకుడు, కార్యకర్త ఎప్పుడు పార్టీ నుండి జంప్ అవుతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటీకే ఆయా నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కండువాలు మారుస్తూ అభ్యర్థులకు ఝలక్ ఇస్తున్నారు. నామినేషన్లు పూర్తయితే అన్ని పార్టీల్లో కూడా సమీకరణలు భారీగా మారడం ఖాయమే అని చెప్పవచ్చు.