రాష్ట్రీయం

సీఎం అభ్యర్థిగా బీసీని ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 21: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యముంటే తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీని ప్రకటించాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సవాల్ చేశారు. ఆదివారం నల్లగొండలో గుత్తా టీఆర్‌ఎస్ నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ అభ్యర్థులు కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎన్.్భస్కర్‌రావు, నోముల నరసింహయ్య, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డిలతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. బైంసా, కామారెడ్డి కాంగ్రెస్ సభల్లో రాహుల్‌గాంధీ ప్రసంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాల పెంచి సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడంటు విమర్శించడం ఆయన అవగాహనా రాహిత్యమని గుత్తా ఖండించారు. 2004నుండి 14వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇపీసీ, అడ్వాన్స్‌మొబలైజేషన్ చెల్లింపు విధానాలు తెచ్చి అవినీతికి బాటలు వేశాయంటు విమర్శించారు. నిత్యం కేసీఆర్‌పై చిటపటలాడే రేవంత్‌రెడ్డి.. ఆనాడు చంద్రబాబుతో కలిసి వైఎస్ జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా విమర్శించి రాజా ఆఫ్ కరెప్షన్ పుస్తకం వేసిన చరిత్ర మరువరాదన్నారు. కాంగ్రెస్ జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా విమర్శించిన టీడీపీ, సీపీఐలు నేడు అదే పార్టీతో మహాకూటమి కట్టడం విడ్డూరమన్నారు. ప్రజాకవి గద్దర్ పుత్రవాత్సల్యంతో కుటుంబంతో వెళ్లి రాహుల్, సోనీయాగాంధీలను కలువడం, కాంగ్రెస్‌కు అనుకూల ప్రచారం చేస్తామనడం ఆయన తీసుకున్న ఆత్మహత్య సృదృశ్య నిర్ణయమంటు గుత్తా అభివర్ణించారు. ఏ పార్టీల ప్రభుత్వాల హాయంలో తన శరీరంలో తుటాలు దిగాయో అవే పార్టీలకు మద్ధతుగా, ఒక్క ఎన్‌కౌంటర్ లేని పాలన అందించిన కేసీఆర్‌కు వ్యతిరేకంగా గద్దర్ ప్రచారం చేస్తామనడంలో ఔచిత్యం తెలంగాణ సమాజానికి అర్ధం కావడం లేదన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనపై విమర్శలు గుప్పిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఉత్తమ్, జానా, అరుణ, దామోదరం, కోమటిరెడ్డి బ్రదర్స్, పొన్నాల వంటి 30మంది నాయకులు తమ కుటుంబ సభ్యులకు 60టికెట్లు కోరుతుండటంపై కాంగ్రెస్ అధిష్టానం జవాబు చెప్పాలన్నారు. మిర్యాలగూడలో జానారెడ్డి తన కొడుకుకు కాంగ్రెస్ టికెట్ కోరుతు 40ఏళ్లుగా జానా గెలుపులో భాగమైన ఆయన శిష్యుడు భాస్కర్‌రావును మిర్యాలగూడలో ఓడించేందుకు యత్నిస్తుండటం సరికాదన్నారు. ఇటీవల మిర్యాలగూడలో పోటీ చేస్తానని చెప్పిన జానారెడ్డి చివరకు మళ్లీ సాగర్‌లోనే పోటీకి సిద్ధపడ్డారని, ఈ దఫా సాగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య చేతిలో జానాకు ఓటమి తధ్యమన్నారు. కేసీఆర్ పథకాల అండతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనె్నండు స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందన్నారు. మహాకూటమి పార్టీలు నేటికి సీట్లు, టికెట్ల లెక్క తేల్చుకోలేకపోతున్నాయని ఆ లెక్కలు తేలితే ముందంతా కూటమిలో కుమ్ములాటలేనంటు గుత్తా ఎద్దేవా చేశారు. ఇప్పటికే విహెచ్ వంటి నేతలకు రాహుల్ పర్యటనలో అవమానాలు, బండ్ల గణేష్ వంటి వారికి ప్రాధాన్యతనిచ్చిన తీరు కాంగ్రెస్ దివాళకోరు రాజకీయాలకు అద్దం పట్టిందన్నారు. ఎన్నికల్లో గెలువడానికి కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు వాగ్ధానాలు కురిపిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వమొస్తే యాదాద్రి థర్మల్ ఫ్లాంట్ రద్ధు చేస్తామన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి దమ్ము, ధైర్యముంటే దానిని మేనిఫెస్టోలో పెట్టాలని గుత్తా సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ పథకాలు అమలు చేయాలని గుత్తా డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి రైతుబంధు పథకం రెండోవిడత సహాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తారని గుత్తా వెల్లడించారు.
రాష్ట్రంలో 1.55కోట్ల ఎకరాలకుగాను 12వేల కోట్ల బడ్జెట్‌ను ఇప్పటికే ప్రభుత్వం వ్యవసాయశాఖకు విడుదల చేసిందన్నారు. కొత్తగా పాస్‌పుస్తకాలు పొందిన వారికి గడిచిన మొదటి విడత, ప్రస్తుత రెండవ విడత రైతుబంధు మొత్తాన్ని డిసెంబర్ 12వ తేది పిదప ఎన్నికల కోడ్ పూర్తికాగానే రైతులకు అందిస్తారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3లక్షల 80వేల మందికి పాస్‌పుస్తకాలు ఇవ్వాల్సివుండగా 3లక్షల మందికి ఇచ్చామని, 43వేల పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, మరో 33వేలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఐకెపి కేంద్రాలు తెరిచారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 107కేంద్రాలు తెరువడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు తిప్పన విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.