రాష్ట్రీయం

తాడోపేడో తేల్చుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: దగాపడిన అగ్రిగోల్డ్ బాధితుల కోసం మరో విడత ఉద్యమానికి కార్యాచరణ రూపొందించామని, ఇది ప్రభుత్వానికి చివరి హెచ్చరికని, ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యామని ఏపీ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వీ తిరుపతిరావు తెలిపారు. వచ్చే నెల 1, 2 తేదీల్లో బాధిత మహిళల ధర్మాగ్రహ దీక్ష చేపడతామని వెల్లడించారు. నగరంలోని దాసరి భవన్‌లో ఆదివారం అసోసియేషన్ రాష్ట్ర, వివిధ జిల్లాల నేతలతో కలిసి వారిద్దరూ విలేఖరులతో మాట్లాడారు. ముప్పాళ్ల మాట్లాడుతూ గతంలో అగ్రిగోల్డ్ కంపెనీపై పోలీసులు దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారని గుర్తుచేశారు.
నిత్యం జరిగిన చర్చలతో డబ్బులు ఇవ్వని నేపథ్యంలో నెల్లూరు, ఏలూరు, కర్నూలు, గుంటూరు, తదితర ప్రాంతాల్లో బాధితులు ఉద్యమించారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం కోసం విజయవాడ ధర్నాచౌక్, తదితర ప్రాంతాల్లో గత ఏడాది 18 రోజులు నిరవధిక దీక్షలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచామన్నారు. ఆ దీక్షల చివరిరోజైన ఆగస్టు 23న సీఎం చంద్రబాబు అసోసియేషన్ నేతలను అమరావతికి పిలిపించి చర్చించారని తెలిపారు. గత మే 30, 31న గుంటూరులో న్యాయపోరాట దీక్ష చేపట్టామని, అమరావతికి పాదయాత్రకు పిలుపునిచ్చామని గుర్తుచేశారు. ఆ సమయంలో మంత్రి నక్కా ఆనంద్‌బాబు అక్కడకు వచ్చి బాధితుల సమస్యల్ని త్వరితగతిన పరిశీలిస్తామని, ఢిల్లీ నుంచి న్యాయవాదులను పిలిపించి సమస్యను పరిష్కరస్తామని ముఖ్యమంత్రి తరపున భరోసా ఇచ్చారన్నారు. అక్టోబర్‌లోగా వారికి డబ్బులు చెల్లించకుంటే నవంబర్, డిసెంబర్‌లో రాష్ట్రంలో తీవ్రమైన ఉద్యమాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వానికి ముందే హెచ్చరించామన్నారు.
ధర్మాగ్రహ దీక్షలతో పాటు నవంబర్ 4 నుంచి 19 వరకు రాష్టవ్య్రాప్తంగా అన్ని నియోజకర్గ కేంద్రాల్లో అగ్రిగోల్డ్ బాధితుల నిరసన ప్రదర్శనలు చేపడతామని ముప్పాళ్ల వివరించారు. తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పేరిట బీజేపీ నేతలు చేస్తున్న ఉద్యమానికి, తమకూ సంబంధం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలంతా నాలుగేళ్లు వౌనంగా ఉండి చివరి దశలో ఎందుకు ఉద్యమిస్తున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ దుర్గ్భావాని, రాష్ట్ర కార్యదర్శి జే అంజనీదేవి, అసోసియేషన్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కేతినేని అగస్టీన్, నాయకులు పెదచౌదయ్య, ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ
విజయవాడ: రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులకు భారతీయ జనతా పార్టీ ఇక వెన్నుదన్నుగా నిలవనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి ఐదు రోజులు రాష్టవ్య్రాప్తంగా రిలే దీక్షలు జరుపుతామని, విజయవాడలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం చంద్రబాబు అత్యాశకు 32లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై నేటికీ టీడీపీ నేతల కన్ను ఉందన్నారు. చంద్రబాబు నిర్వాకం కారణంగానే ఎస్సెల్ గ్రూప్ వెనక్కి పోయిందని కూడా కన్నా విమర్శించారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న ముప్పాళ్ల నాగేశ్వరరావు