రాష్ట్రీయం

పోలీసుల త్యాగాలు మరువలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు పటిష్టంగా ఉండాలని, అలాంటి వాతావరణ తీసుకురావడానకి విధి నిర్వహణలో పోలీసులు అమరులు అవుతున్నారని, వారి త్యాగాలను మరువలేనివని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ గోషా మహల్ లో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ నుద్దేశించి మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా జీవించడానకి పోలీసులు నిరంతరం రెప్పవాల్చకుండా పని చేస్తున్నారని, కనీసం పండుగుల సమయాల్లో సైతం పోలీసులు వీధుల్లో గస్తీ తిరుగుతూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారని ఆయన చెప్పారు. దేశంలో అలజడి సృష్టించడానికి టెర్రరిస్టులు, మతోన్మాదులు, అసాంఘిక శక్తులు అనునిత్వం కవ్వింపులకు కాలుదువ్వుతున్న సందర్భాలను ప్రతి రోజు చూస్తున్నామని ఆయన గుర్తు చేశారు.
భారత్- చైనా దేశాల మధ్య 1959లో యుద్ధం జరిగినప్పుడు సరిహద్దుల్లో భీకర్ పోరులో వేలాది మంది పోలీసులు అమరులు అయ్యారని, వారి వీరమరణానికి గుర్తుగా ప్రతి యేటా అక్టోబర్ 21వ తేదీన గుర్తు చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. జన్మభూమికి సేవలు చేస్తూ వీరమరణం పొందడం చారిత్రాత్మకమని ఆయన కొనియాడారు. రేపటి కోసం మనం అంటూ పోలీసులు పని చేస్తున్న విధానం మరువలేనిదని ఆయన అన్నారు. నాలుగు రోడ్ల చౌరస్తాలో ఉన్న మనం ఎటు వెళ్ళాలన్నా భద్రత ముఖ్యమని అందు కోసం పోలీసు సేవలు అత్యవసరం అన్నారు. పోలీస్‌లు, ప్రజలు సంయుక్తంగా పాల్గొంటున్న కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
ఈ యేడాది దేశంలో 414 మంది విధి నిర్వహణలో అమరులు అయ్యారని, అలాగే తెలంగాణలో ఇద్దరు జవానులు అమరులు అయ్యారని ఆయన గుర్తు చేశారు. త్యాగాలకు విలువకట్టలేం కేవలం సహాయం మాత్రమే
అమరుల కుటుంబాలకు సాయం: డీజీపీ
విధి నిర్వహణలో అమరులు అవుతున్న పోలీసుల త్యాగాలకు విలువకట్టలేమని, కేవలం అమరుల కుటుంబాలకు సహాయం చేయడంలో పోలీస్ శాఖ కృషి గర్వించదగ్గ విషయమని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ ప్రతియేటా అమరులను స్మరించుకోవడానికి అక్టోబర్ 21వ తేదీన జరుపుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు. పోలీస్ అమరవీరులకు జోహర్ అంటూ ఆయన నినదించారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం నిఘా ఉంటుందన్నారు.విధి నిర్వహణలో అమరులు అయిన కుటుంబాలకు వారి హోదాను గుర్తిస్తూ ఆర్థిక సహాయంతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందివ్వడం జరుగుతోందని చెప్పారు. పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే అభివృద్ధి ముందుకు సాగుతుందని చెప్పారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి పోలీసులు సిద్ధంగా ఉంటారని చెప్పారు. చత్తీష్‌గడ్ రాష్ట్రంలో మావోస్టులు మారణహోమంలో ఎంతో మంది పోలీసులు అమరులు అవుతున్నారని, అలాగే వారిని కట్టుకున్న భార్యలు సైతం త్యాగాలకు సిద్ధం అవుతున్నారని ఆయన గుర్తు చేశారు. అమరుల కుటుంబాలకు రవాణాలో ( ప్రయాణించడానికి) సైతం రాయితీలు ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ కొత్వాల్ అంజనీకుమార్‌తో పాటు ఇతర సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్ గోషా మహల్‌లో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో
నివాళులర్పిస్తున్న గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్