రాష్ట్రీయం

సర్దుబాటు సమస్య కారాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: రానున్న అంసెబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటు సమస్య కారాదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం నాడు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ నేతలతో భేటీ అయిన చంద్రబాబు అనేక అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. టీఆర్‌ఎస్ నేతలంతా టీడీపీ తయారుచేసిందేనన్న విషయం మరువరాదని అన్నారు. బీజేపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, టీఆర్‌ఎస్ అరాచకాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని, సీట్ల కేటాయింపుపై రాహుల్‌తో మాట్లాడదామని వారికి భరోసా ఇచ్చారు. ఈ భేటీలో పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధానకార్యదర్శులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ ఇటీవల చేపట్టిన కార్యక్రమాలు, ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తీరుపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ఆయనకు వివరించారు. 1982 నుండి పార్టీ అనేక మంది నాయకులను తయారుచేసిందని పేర్కొన్న చంద్రబాబు తెలుగు దేశం పార్టీపై జరుగుతున్న దాడులు, టీఆర్‌ఎస్ అనుసరిస్తున్న విధానాలను చర్చించారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రాజకీయ నాయకత్వం
ఉండరాదనే విధానంతో టీఆర్‌ఎస్ పోతోందని, అదే విధంగా బీజేపీ సైతం తమకు వ్యతిరేకంగా రాజకీయ నాయకత్వం ఉండకూడదనే తీరు కొనసాగిస్తోందని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం తప్పక చేయాల్సి ఉందని, నరేంద్రమోదీ కొంత మంది కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారే తప్ప సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని , ప్రజలు గుర్తుపెట్టుకోదగిన ఒక్క పథకాన్నీ కూడా మోదీ ప్రభుత్వం తీసుకురాలేదని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. రాఫెల్ కుంభకోణం, డీమానిటైజేషన్, జీఎస్టీ ప్రజలకు పెనుభారం అయ్యాయని అన్నారు. టీడీపీ మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రాంలను చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని, మహాకూటమి గెలుపే ధ్యేయంగా వెళ్లాలని చంద్రబాబు వారికి సూచించారు. అందరికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాదని, అవకాశం రానివారికి తగిన రీతిలో గుర్తింపు ఇస్తామని అన్నారు. హైదరాబాద్‌కు ఎమిరేట్స్ మొదటి ఫ్లైట్ తెచ్చినపుడు పడిన ఇబ్బందులను చంద్రబాబు గుర్తుచేస్తూ, ఇపుడు విజయవాడకు సింగపూర్ ఫ్లైట్ తీసుకురావడంలోనే అవే ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని ప్రజలు మరిచిపోరని, టీడీపీని ఇబ్బంది పెట్టాలని అన్ని వ్యవస్థలనూ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, టీఆర్‌ఎస్ అక్రమాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. ప్రైవేటు వ్యాపారానికి సంబంధించిన ఒక ఉదంతాన్ని ఎల్ రమణకు ఆపాదించే ప్రయత్నం టీఆర్‌ఎస్ పెద్దలు చేయడం దుస్సాహసమని అన్నారు. టీఆర్‌ఎస్ కుట్రను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.
నియంతృత్వపాలకు చరమగీతం
రాష్ట్రంలో నియంతృత్వపాలనకు త్వరలో చరమగీతం పలుకుతారని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన సూచనలతో ముందుకు వెళ్తామని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగానే మహాకూటమి ఏర్పడిందని, ఏకాభిప్రాయంతో మహాకూటమి ముందుకు వెళ్లి విజయం సాధిస్తుందని చెప్పారు.
చిత్రం..ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు