రాష్ట్రీయం

బాబు పాలన అబద్ధాల మయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, అక్టోబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన అబద్ధాలమయమని వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి విమర్శించారు. సోమవారం విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని జైపూర్‌రోడ్డు జంక్షన్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో ప్రజలను మోసగించారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోకుండా ఆ ఆస్తులను సీఎం చంద్రబాబునాయుడు ఎలా కొట్టేయాలా అని కుట్రలు పన్నుతున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందని ద్రాక్షగా మారిందన్నారు. పూర్తి రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం రుణమాఫీకి బ్యాంకులకు డబ్బులు చెల్లించకపోవడంతో తిరిగి బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. విశాఖలో సెమినార్లు, సదస్సులు పెట్టి ఉత్తరాంధ్రలో 20 లక్షల పెట్టుబడులు వచ్చాయని, తరువాత 40 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. పోలవరం రాష్ట్రానికి వరమని, అది పూర్తయితే ఉత్తరాంధ్ర సస్యశ్యామలవుతాయన్నారు. అయితే ఆ ప్రాజెక్టును అవినీతిమయం చేశారన్నారు. ఆర్థిక మంత్రి వియ్యంకుడే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి వలనే కేంద్రం నిదులు ఇవ్వడం లేదన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవిని అన్నారు. తిత్లీ తుఫాన్ బాధితులకు చేసింది తక్కువ ప్రచారం ఎక్కువన్నారు. తుఫాన్ వలన 3,466 కోట్లు నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా ఇంతవరకు చేసింది ఏమీ లేదన్నారు. తుఫాన్ బాధితులను జగన్ పరామర్శించ లేదనడం సిగ్గుచేటన్నారు. త్వరలో శ్రీకాకుళం జిల్లాకు వెళతానని, నష్టాన్ని అంచనా వేస్తామన్నారు. వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, భూమాన కరుణాకరరెడ్డి, పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్పశ్రీవాణీ, బొత్స అప్పలనరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ప్రజాసంకల్పయాత్రలో మాట్లాడుతున్న వైసీపీ అధినేత జగన్