రాష్ట్రీయం

కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘ కేసీఆర్ కుటుంబ పాలనకు, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి కల్పించడమే తమ కూటమి ప్రధాన లక్ష్యమని సోమవారం ఆయన ప్రకటించారు. ఎన్నోఏళ్ల సుదీర్ఘ పోరాటం ద్వారా ఫలించిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం గుప్పిట్లో బందీగా చిక్కుబడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు ఈ ఎన్నికల్లో అంతమొందించకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. సీపీఐ ఆధ్వర్యంలో వెలువడుతున్న 3ప్రజాపక్షం2 దిన పత్రిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహాకూటమి సారథులు హాజరయ్యారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదండరామ్, ఎల్ రమణ, చాడా వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ సర్కార్ మీడియాను కూడా భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి లొంగదీసుకుందని విపక్ష నేతలు తీవ్ర ఆరోపణ చేశారు. ప్రజల గొంతుకగా ఉండాల్సిన మీడియా రాష్ట్రంలో పాలకులకు బాకాలుగా మారాయని ధ్వజమెత్తారు. తమకు అనుకూలంగా లేని మీడియా సంస్థలపై కక్షసాధింపులకు దిగుతోందని నేతలు మండిపడ్డారు. నిరంకుశ కేసీఆర్ పాలనకు చరమగీతం పాడకపోతే ప్రజాస్వామ్య మనుగడనే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని ఉత్తమ్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులను పక్కనపెట్టి ప్రభుత్వంలో ఉద్యమ ద్రోహులను భాగస్వామ్యం కల్పించారన్నారు. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక చర్యలపై నిరసన తెలియజేసే హక్కులను కూడా కాలరాశారని విమర్శించారు. నియంత పాలనకు చరమగీతం పాడాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను గద్దెదించాలన్న ప్రధాన లక్ష్యంతో ఏకమైన తమకు సీట్లు సర్దుబాటు ఆటంకం కాదన్నారు. తమకు లక్ష్యసాధననే ముఖ్యమన్నారు. సీఎం కేసీఆర్ గ్రాఫ్ కేవలం నెల రోజుల్లోనే 60 నుంచి 30 శాతానికి పడిపోయిందని టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అభిప్రాయపడ్డారు. సీఎం నిరంకుశ పాలన అంతమొందడానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులు హరించుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రజల గొంతుకను
వినిపించడానికి ప్రలోభాలకు లొంగని మీడియా ప్రస్తుతం అవసరం ఉందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మీడియా సంపాదకుల సూచనలు, సలహాలను తీసుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కలిసిపని చేసిన రాజకీయ పక్షాలను కూడా ఆహ్వానించకుండా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడంతోనే ఆయన నిజస్వరూపం బయటపడిందన్నారు. నిజాం నిరంకుశ పాలనకే చరమగీతం పాడిన తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్‌ను గద్దె దించడం పెద్ద పనికాదని చాడా ప్రకటించారు. నిరంకుశ కేసీఆర్‌ను గద్దె దించడం, ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణనే లక్ష్యంగా కూటమి ఏర్పడిందని చాడా అన్నారు. ప్రజాపక్షం సంపాదకుడు కె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో మీడియా పాలకుల చేతిలో బందీగా మారిందన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభను కవర్ చేయనీ చానల్స్ కూడా ఆయన విమర్శలపై ధ్వజమెత్తిన కేటీఆర్ ప్రెస్‌మీట్‌ను లైవ్ ఇచ్చాయని ఆయన అన్నారు. ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం మీడియాను గుప్పిట్లో పెట్టుకుని ప్రజల గొంతుక బయటకు రాకుండా చేసిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా లేని మీడియా సంస్థలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రజాపక్షం పత్రికను ఆవిష్కరించిన సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, మీడియాను కార్పొరేట్ సంస్థలు గుప్పిట్లో పెట్టుకున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. ఇంకా ఈ కార్యమ్రంలో నవ చేతన విజ్ఞాన సమితి చైర్మన్ పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వర్‌రావుతో పాటు సీపీఐ నేతలు పలువురు పాల్గొన్నారు.