రాష్ట్రీయం

సీట్ల పీటముడి వీడేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 23: టీఆర్‌ఎస్ పార్టీని ఓడించేందుకు మహాకూటమిగా జట్టుకట్టిన పార్టీల్లో విభేదాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి మధ్య పొత్తుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లానే కీలకం కావటంతో ఇక్కడ ఉన్న 10 స్థానాల్లో ఐదింటిలో కూటమి మధ్య విభేదాలు అధికంగా ఉన్నాయి. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం, వైరా, పినపాక నియోజకవర్గాలలో పార్టీల మధ్య సయోధ్య కుదరటంలేదు. ఖమ్మం, పాలేరులలో కాంగ్రెస్, తెలుగుదేశం.. కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్, తెలుగుదేశం.. వైరా, పినపాకలలో సీపీఐ, కాంగ్రెస్‌లు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతూ అందుకు అనుగుణంగా ప్రచారం చేసుకుంటున్నాయి. మరోవైపు తెలుగుదేశం సిట్టింగ్ స్థానమైన సత్తుపల్లిలో కాంగ్రెస్ పోటీ చేస్తుందనే ప్రచారం కూడా సాగుతున్నది. ఈ క్రమంలోనే వైరా, కొత్తగూడెం, పినపాకలలో సీపీఐ, కాంగ్రెస్‌లు ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఖమ్మం, పాలేరులలో ఆ పరిస్థితి లేకపోయినా ఎవరికి వారు తామే పోటీ చేస్తామంటూ లోపాయికారిగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో ఖమ్మంలో పొత్తులు కుదిరితేనే రాష్ట్రంలో అన్ని స్థానాలలో సయోధ్య కుదురుతుందని అంచనాలు వేస్తున్నారు. అయితే ఎవరికి వారు ఆ స్థానంలో తామే పోటీ చేస్తామంటూ ప్రచారం కార్యక్రమం నిర్వహిస్తుండటంతో ఆ పార్టీల మద్దతుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు పోటీ చేస్తారో తెలియకుండా ఎవరికి వారు విడివిడిగా ప్రచారాలు చేసుకుంటుపోతే ప్రత్యర్థికి లాభం జరుగుతుందని పేర్కొంటూన్నారు. మరోవైపు తెలంగాణ జనసమితి కూడా ఖమ్మం స్థానాలలో పోటీ చేస్తామని చెబుతుండటం పట్ల మహాకూటమిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా మహాకూటమి పొత్తుల వ్యవహరం ఈ నెల 24వ తేదీన తేలనున్నదని, అందులో తీసుకునే నిర్ణయాలను అన్ని పార్టీలు పాటిస్తాయని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. ఇందుకోసం 24వ తేది ఉదయం ఖమ్మం జిల్లాకు చెందిన ప్రధాన నేతలతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల రాష్ట్ర నేతలు సమావేశం కానున్నట్లు తెలిసింది. పొత్తులలో సీట్లు తీసుకోవటం కేవలం గెలుపు ఆధారంగానే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తొంది.