రాష్ట్రీయం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు టాప్‌గేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 23: టికెట్ల కేటాయింపులో ముందంజలో ఉన్న టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో కూడా దూకుడు పెంచింది. అభ్యర్థులను ప్రకటించిన మొదట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ ఏకపక్షంగా ప్రకటించిన అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నప్పటికీ రానురాను అది సద్దుమణిగి ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. మహాకూటమి నుండి అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఆశావాహుల్లో నరాలు తెగే ఉత్కంఠం నెలకొంది. పాత వరంగల్ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాల్లో మినహా మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు సొంత పార్టీ నాయకుల నుండి తలనొప్పి ఒక ఎత్తయతే.. ఈ నియోజకవర్గంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఏ స్థానాలు కావాలని పట్టుబడుతాయో తెలియని పరిస్ధితి నెలకొంది. ఒక వైపు సొంత పార్టీ నేతల ఒత్తిడి, మరోవైపు మహాకూటమి నుండి తీవ్ర ఒత్తిడిని కాంగ్రెస్ హైకమాండ్ ఎలా తట్టుకుని మందుకు పోతుందో తెలియక అధిష్ఠానం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మహాకుటమిలో టికెట్ల పంపిణీ ఒక ప్రహసనం కానుందనడంలో సందేహం లేదు. టికెట్ల ఖరారు తర్వాత పరిస్థితిలు ఎలా ఉంటాయోనని ఆందోళన నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని భూపాలపల్లి నుండి గండ్ర వెంకటరమణరెడ్డి, జనగామ నుండి పొన్నాల లక్ష్మయ్య, నర్సంపేట నుండి దొంతి మాధవరెడ్డి, మహబూబూబాద్ నుండి బలరాం నాయక్ ఈ నలుగురికి ఈ నాలుగు నియోజకవర్గాల నుండి మాత్రమే ఒక్కో అభ్యర్థి పోటీ పడుతున్నారు. ఈ నాలుగు నియోజవర్గాల్లో నర్సంపేట నుంచి టీడీపీ, జనగామ టీజేఎస్ పార్టీ కోరే అవకాశం లేకపోలేదు. అదే విధంగా పరకాల నుండి గతంలో పోటీ చేసిన ఇనగాల వెంకట్రాంరెడ్డితో పాటు టీఆర్‌ఎస్ నుండి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కొండా సురేఖ పోటీపడుతున్నారు. అదే విధంగా స్టేషన్ ఘనపూర్‌లో గతంలో పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ విజయరామరావుతోపాటు పార్టీ నాయకురాలు ఇందిరా, దొమ్మటి సాంబయ్యలు పోటీలో ఉన్నారు. వర్ధన్నపేట నుండి గతంలో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీ్ధర్‌తోపాటు ఏఐసీసీ నాయకుడు బక్క జడ్సన్ పోటీలో ఉన్నారు. ములుగు నుండి మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యతోపాటు టీడీపీ నుండి రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే సీతక్క పోటీలో ఉన్నారు. పాలకుర్తిలో డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్ సతిమణి దుగ్యాల సుమణ పోటీలో ఉన్నారు. వరంగల్ పశ్చిమ నుండి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డితో టీడీపీ నుండి రేవంత్‌రెడ్డి పాటు కాంగ్రెస్‌లో చేరిన వేంనరేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వరంగల్ వెస్ట్‌లో కొండా సురేఖతో పాటు అచ్చా విద్యసాగర్, మరో ఐదుగురు పోటీలో ఉన్నారు. ఇదిలా ఉండగా మహాకూటమి నుండి టీడీపీ, టీజేఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేరోరెండు సీట్లు కావాలని గట్టిగా కోరుతుండగా సీపీఐ కూడా స్టేషన్ ఘనపూర్ సీటు కావాలని పట్టుబడుతోంది. బీజేపీ విషయానికి వస్తే జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో రెండు స్దానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. జయశంకర్‌భూపాలపల్లి జిల్లా అభ్యర్థిగా చందుపట్ల కీర్తిరెడ్డి, పరకాల అభ్యర్ధిగా విజయచందర్‌రెడ్డి ఉన్నారు. వరంగల్ పశ్చిమ నుండి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావుకు అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు మధ్య తీవ్ర పోటీ ఉంది. మిగతా నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ పోటీ లేదు.