రాష్ట్రీయం

వృద్ధులు, దివ్యాంగులు శ్రీవారిదర్శన వేళల్లో స్వల్పమార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 23: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే వృద్ధులు, దివ్యాంగులకు ఇకపై ప్రతి బుధవారం ఉదయం 10 గంటల దర్శన స్లాట్‌ను టీటీడీ రద్దుచేసింది. కాగా మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో దర్శన టోకెన్ల సంఖ్యను 700 నుంచి 1000కి పెంచింది. 65 ఏళ్లుపైబడిన వృద్ధులకు, శారీరక, మానసిక వైకల్య సమస్యలున్న వారికి టీటీడీ అన్ని సౌకర్యాలతో సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఇందుకోసం 7 కౌంటర్లను టీటీడీ ఏర్పాటుచేసింది. ఇక్కడ ఉదయం 10 గంటల స్లాట్‌కు 700 మందికి, మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌కు 700 మందికి టోకెన్లు మంజూరు చేస్తున్నారు. శుక్రవారాల్లో మధ్యాహ్నం మాత్రమే 700 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇకపై ప్రతి బుధవారం మధ్యాహ్నం 1000 దర్శన టోకెన్లు మంజూరుచేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ పలు సౌకర్యాలు కల్పిస్తోంది. టోకెన్లు పొందినవారు రాయితీపై రూ. 20కు రెండు లడ్డూలు, రూ. 70కు నాలుగు లడ్డూలు కొనుగోలు చేయవచ్చు. కౌంటర్ల నుంచి 2 బ్యాటరీ వాహనాలు, ఒక వ్యాన్ ద్వారా వృద్ధులు, దివ్యాంగులను దక్షిణ మాడ వీధి వద్దగల వేచి ఉండే హాళ్లకు తరలిస్తారు. మొత్తం 3 వేచి ఉండే హాళ్లలో వెయ్యి మందికిపైగా కూర్చొనేందుకు కుర్చీలను ఏర్పాటుచేశారు. మరుగుదొడ్ల వసతి ఉంది. ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదాలను పంపిణీ చేస్తారు. ఈ హాళ్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను తిలకించేందుకు టీవీని ఏర్పాటుచేశారు. సెల్‌ఫోన్లు, లగేజీని ఇక్కడే డిపాజిట్ చేసే సౌకర్యం ఉంది. దర్శనం తరువాత ఇక్కడే వీటిని పొందవచ్చు. వేచి ఉండే హాస్టళ్ల నుంచి ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనానికి పంపుతారు. నడవలేని వారికి శ్రీవారి సేవకులను సహాయకులుగా పంపుతారు.
నెలకు రెండు సార్లు 4వేల మందికి అనుమతి
రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో రెండు సార్లు వయో వృద్ధులకు, దివ్యాంగులకు కలిపి 4వేల టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు, మధ్యాహ్నం 2 గంటలకు 2వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. రద్దీరోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా వృద్ధులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరంలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తులకోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను నెలలో రెండు సాధారణరోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.