రాష్ట్రీయం

టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్స్ ఎంపికకు 6న ఆన్‌లైన్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణలో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్స్ ఎంపికకు ఈ నెల 6వ తేదీన ఆన్‌లైన్ సిబిఆర్‌టి పరీక్ష నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. ఈ పరీక్షకు 19721 మంది దరఖాస్తు చేశారని అన్నారు. పరీక్ష పేపర్-1 ఆరో తేదీన ఉదయం 10 గంటల నుండి 12.30 వరకూ జరుగుతుందని, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకూ జరుగుతుందని చెప్పారు. అభ్యర్ధులు తమ హాల్‌టిక్కెట్లను టిఎస్‌పిఎస్‌సి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్ధులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆమె సూచించారు. అలాగే మధ్యాహ్నం పరీక్షకు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. అభ్యర్ధులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లేముందు బయోమెట్రిక్ పరీక్ష ఉంటుందని ఆమె వెల్లడించారు.

సత్యదేవుని అంతరాలయానికి స్వర్ణ తాపడం

శంఖవరం, డిసెంబర్ 1: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి అంతరాలయం గోడలకు దాతలు చేయించిన స్వర్ణ తాపడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖామాత్యులు నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన మట్టే శ్రీనివాస్, ఎంఎస్ ప్రసాద్ రూ.30 లక్షల వ్యయంతో స్వర్ణ తాపడం చేయించారు. స్వర్ణ తాపడం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి మంత్రి చినరాజప్ప, దాతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహానందీశ్వరుని
నిజరూప దర్శనభాగ్యం

మహానంది, డిసెంబర్ 1: భక్తులకు ఇకపై మహానందీశ్వరుని నిజరూప దర్శనభాగ్యం కలుగనుంది. అదే విధంగా సామాన్య భక్తులకు ఉచిత దర్శన సౌకర్యం కల్పించనున్నారు. మంగళవారం జరిగిన పాలకమండలి అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అభిషేకాల సమయంలో మాత్రమే స్వామివారి నిజరూప దర్శనభాగ్యం కల్పించేవారు. ఇకపై ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఓ గంట పాటు మహానందీశ్వరుని నిజరూపాన్ని భక్తులు దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.