రాష్ట్రీయం

తూ.గో.లో 350 అడుగుల రెడ్ రిబ్బన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, డిసెంబర్ 1: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అంతా అవగాహన పెంచుకోవాలని సందేశమిస్తూ మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో 350 అడుగుల భారీ రెడ్ రిబ్బన్‌తో విద్యార్థులు ప్రదర్శన జరిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రావులపాలెం లిటిల్ ఫ్లవర్ హైస్కూలుకు చెందిన సుమారు 400మంది విద్యార్థినీ విద్యార్థులు ఒక మీటరు వెడల్పు, వంద మీటర్ల పొడవైన (సుమారు 350 అడుగులు) ఉన్న రెడ్ రిబ్బన్‌తో పాఠశాల వద్దనుండి పుర వీధుల గుండా ఎయిడ్స్ అవగాహనా ర్యాలీ నిర్వహించారు. అనంతరం 16వ నెంబరు జాతీయ రహదారిపై స్థానిక కళా వెంకట్రావు సెంటర్లో ఎయిడ్స్ వ్యాధికి మందులేదు..నివారణ ఒక్కటే మార్గమంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో స్కూలు డైరెక్టర్ పివిఎస్ సూర్యకుమార్, ఎంపిపి కోట చెల్లయ్య, జడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, ప్రముఖ ఇంద్రజాలికుడు చింతా శ్యామ్‌కుమార్, ఊబలంక, గోపాలపురం పిహెచ్‌సి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరాలి

జనచైతన్య యాత్రలో చంద్రబాబు

ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, డిసెంబర్ 1: కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీని మోసం వెళ్లిపోయినప్పటికీ వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తల త్యాగంతోనే నేడు పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తలను అభినందించారు. గుంటూరు జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో మంగళవారం జనచైతన్య యాత్రలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కార్యకర్తలు త్యాగాలు మరవలేనని, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. డిసెంబర్ 8వ తేదీ నాటికి పార్టీ అధికారం చేపట్టి 18 నెలలు పూర్తి అవుతోంతుందని, ఈ ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా చూడాల్సిన బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలన్నారు. సంక్షేమ పథకాలకు దేశంలోనే కేరాఫ్ తెలుగుదేశం పార్టీ అని, 1983వ సంవత్సరంలోనే పేదవాడి కడుపు నిండాలనే కాంక్షతో కిలో రెండు రూపాయలకే బియ్యం పథకం ప్రవేశపెట్టిన ఘనత, దూరదృష్టి ఎన్‌టి రామారావుకు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పెన్షన్‌గా కేవలం రూ.200లు ఇచ్చి గొప్పలు చెప్పుకుందని, వారి కంటే 5 రెట్లు ఎక్కువగా ఇచ్చి వృద్ధులు, వితంతవులను ఆదుకుంటున్నామన్నారు. ఐదున్నర నెలల్లో పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి రాష్ట్రాన్ని కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది జూలై నెల నుంచే కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి డెల్టా ప్రాంతాల ప్రజలు నాట్లు వేసుకునే విధంగా నీరందిస్తామన్నారు. వైఎస్‌ఆర్ తన అధికారంతో కుటుంబం కోసం రాష్ట్రానే్న దోచిపెట్టాడన్నారు.

జనచైతన్య యాత్రలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు