ఆంధ్రప్రదేశ్‌

దగాకోరులకు భంగపాటు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: రాజకీయాల్లో విశ్వసనీయత, వ్యక్తిత్వం ఉండాలని వాటిని మార్గదర్శకాలుగా పాటించాలని చంద్రబాబునాయుడుకు అవి రెండూ లేవని ఉన్నదల్లా అబద్ధాలు చెప్పటం, నమ్ముకున్న వారిని మోసం చేయటమేనని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో బుధవారం కాంగ్రెస్ నాయకుడు ఆనం విజయకుమార్ రెడ్డితో పలువురు పలువురు పార్టీ నాయకులు వైఎస్‌ఆర్‌సిపి పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు నాయుడు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారన్నారు. వేరే పార్టీ జెండాతో గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, వారిని అవినీతి సొమ్ముతో కొనుగోలు చేశాడని ఆరోపించారు. రాజకీయాల్లో విశ్వసనీయత ప్రధానమని అవి రెండూ చంద్రబాబుకు లేకపోవటం దురదృష్టకరమన్నారు. చంద్రబాబుకు ఉన్నదల్లా అసత్యాలు పలకటం, నమ్ముకున్న వారిని మోసం చేయటమేనని ఘాటుగా విమర్శించారు. ప్రత్యేకించి రుణమాఫీలో రైతులను, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగ భృతి అని యువతను మోసం చేశాడన్నారు. అధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచిన ఘనత కూడా ఆయనదేనన్నారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచటంలో ఘోరంగా విఫలమయిన చంద్రబాబు అవినీతి సొమ్ముతో తెలంగాణలో ఓటుకు నోటు, రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం వంటి నీచమైన చేష్టలకు ఒడిగట్టారని దుయ్యబట్టారు. ఇటీవల కాలంలో కులాల పేరిట చిచ్చుపెట్టి వారిని సైతం మోసపుచ్చే ప్రయత్నాలను మొదలు పెట్టారని విమర్శించారు. రాజకీయ పార్టీలు మారటం తప్పుకాదని, అయితే వారు గెలిచిన పార్టీకి రాజీనామా చేసి విశ్వసనీయత పొందాలన్నారు. తాను, వైఎస్ విజయమ్మ, ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి అలా ప్రజాతీర్పు కోరామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షం బాధ్యతగా ప్రవర్తించి ఇచ్చిన హామీలు అమలు పరచాలని ప్రశ్నిస్తే ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన సామ్రాజ్యాలే కూలాయి అలాంటి గతే చంద్రబాబు ప్రభుత్వానికి పట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాజకీయాల్లో ప్రజలను నమ్ముకోవాలే గానీ నాయకులను కాదని అలా ప్రజల ఆశీర్వాదంతో రాజకీయాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజల్లో విశ్వసనీయత లేని చంద్రబాబు సోనియాగాంధీతో కుమ్మక్కై తనపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కష్టమని తెలిసినా ప్రజా సంక్షేమం కోసం నిరంతర పోరాటం చేస్తున్నామన్నారు. ఎపుడు ఎన్నికలు వచ్చినా ప్రజల విశ్వాసం పొందే, ఉజ్వల భవిష్యత్ ఉండే ఏకైక పార్టీ వైఎస్‌ఆర్‌సిపి అన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆనం విజయకుమార్ రెడ్డి, ఆయన తనయుడు కార్తికేయ రెడ్డిలను సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించి స్వాగతం పలికారు. విజయకుమార్ రెడ్డితో పాటు పలువురు పంచాయతీ సర్పంచులు, ఎంపీటిసిలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల డైరెక్టర్లు, తదిరులు పాల్గొన్నారు.

నెల్లూరులో ఆనం సోదరుడు ఆనం విజయకుమార్‌రెడ్డికి
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్