తెలంగాణ

‘షాదీ ముబారక్’లో అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో షాదీ ముబారక్ పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. రాష్టవ్య్రాప్తంగా షాదీముబారక్‌పై ఏసిబి నిఘా వేసింది. పలు జిల్లా కేంద్రాల్లోని మైనార్టీ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. బుధవారం 20కి పైగా కేసులు నమోదు చేసింది. ఏసిబి, సౌత్ జోన్ పోలీసుల సంయుక్త్ధ్వార్యంలో పాతబస్తీలోని ఓ మీ-సేవ కార్యాలయంలో తనిఖీ చేయగా కుంభకోణం వెలుగుచూసింది. పేదల పెళ్లిళ్లకు తెలంగాణ ప్రభుత్వం 51వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. బహదూర్‌పురకు చెందిన ఫౌజియాబేగం తన కూతురు వివాహానికి ఆర్థిక సహాయం కోసం మీ-సేవ ప్రొప్రయిటర్ జాహెద్ అలీని సంప్రదించింది. దీంతో ఆయన రెండు (పెళ్లికూతురు) పాస్‌పోర్టు ఫొటోలు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, పెళ్లి పత్రిక ఇవ్వాలని అన్నాడు. దీంతో ఆమె అన్ని పత్రాలను సమర్పించింది. ఇందుకు గానూ రూ.2000లు డాక్యుమెంటేషన్ ఖర్చుల కింద తీసుకున్నాడు. ఇందుకు సంబధించి 11 ఫిబ్రవరి 2015లో ఓ రశీదు కూడా ఇచ్చాడు. మూడు నెలలైనా షాదీముబారక్ డబ్బులు రాకపోవడంతో బాధితురాలు విస్తుపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏసిబి, సౌత్ జోన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ-సేవలో పనిచేస్తున్న రవి అనే ఉద్యోగి మంజూరైన నిధులు కాజేసినట్టు దర్యాప్తులో తేలింది. రూ. 51వేలు మంజూరు కాగా రూ. 20 వేలు మాత్రమే లబ్దిదారుకు ఇచ్చారని బాధితురాలు తెలిపింది. అక్రమానికి పాల్పడిన రవితోపాటు మీ-సేవ నిర్వాహకుడు జాహెద్ అలీని కూడా అరెస్టు చేసినట్టు సౌత్ జోన్ డిసిపి సత్యనారాయణ తెలిపారు. అదేవిధంగా 20కి పైగా దరఖాస్తులను పరిశీలించి అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

వాట్సాప్‌లో టెన్త్ పేపర్ కేసు..
ఇద్దరి అరెస్టు
దేవరకొండ, మార్చి 23: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండమల్లెపల్లిలోని సాయిసిద్దార్ధ ప్రైవేట్ పాఠశాలలో ఉన్న పదోతరగతి పరీక్షా కేంద్రంలో తెలుగు 2 పేపర్‌ను సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి వాట్సప్‌లో పోస్ట్ చేసిన నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, తెలుగు టీచర్ పస్నూరి రాజ్‌కుమార్‌లను బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్‌కు పంపిననట్లు డిఎస్పీ చంద్రమోహన్ తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను బుదవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మీడియాకు చూపించిన అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సాయిసిద్దార్ధ ప్రైవేట్ పాఠశాలలో వార్డెన్‌గా పనిచేసే నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం పరీక్షా కేంద్రంలోకి వెళ్ళి తెలుగు 2 పేపర్‌ను తన సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి దానికి సంబంధించిన సమాధానాలను ఇదే పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేసే పస్నూరి రాజ్‌కుమార్‌తో రాయించి ప్రజ్ఞటుడే ఎస్‌సిహెచ్ అనే గ్రూప్‌కు పోస్ట్ చేశాడని ఆయన చెప్పారు. ఉద్దేశపూర్వకంగా పరీక్ష పేపర్‌ను వాట్సప్‌లో పంపించిన శ్రీనివాస్‌రెడ్డి, రాజ్‌కుమార్‌లపై ఎపి పబ్లిక్ ఎక్జామినేషన్ యాక్ట్ సెక్షన్ 8, 1997, సెక్షన్ 67 ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేసి బుధవారం కోర్టులో రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. కేసు ఇంకా విచారణలో ఉందని, పదోతరగతి పరీక్ష పేపర్‌ను లీక్ చేసేందుకు యత్నించిన కేసులో మరింత లోతుగా విచారణ చేయనున్నామని ఆయన తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే వారిని కూడా అరెస్ట్ చేస్తామని డిఎస్పీ చంద్రమోహన్ చెప్పారు.

ఈ విలేఖరుల సమావేశంలో ఎస్‌ఐలు ఖలీల్‌ఖాన్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

కుడి కాల్వకు మళ్లీ మంచినీరు విడుదల

నాగార్జునసాగర్, మార్చి 23: నాగార్జునసాగర్ జలాశయం నుండి బుధవారం కుడికాల్వ ద్వారా ఆంధ్రా రాష్ట్రానికి తాగునీటి అవసరాల నిమిత్తం డ్యాం అధికారులు నీటివిడుదల చేశారు. గత రెండు నెలల కాలంలో ఇప్పటికే రెండుసార్లు కుడికాల్వకు రెండుసార్లు కృష్ణాడెల్టా ద్వారా ఆంధ్రా రాష్ట్రానికి తాగునీటిని విడుదల చేశారు. తాజాగా వారం రోజుల క్రితం కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయం ప్రకారం 11 టిఎంసిల నీటిని ఇరు రాష్ట్రాలకు తాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 4.5 టిఎంసిల నీటిని కుడికాల్వకు, 6.5 టిఎంసిల నీటిని ఎడమకాల్వకు నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత రెండునెలలుగా ఎడమకాల్వ పరిదిలోని ప్రజలు, నాయకులు ఎడమకాల్వకు వెంటనే నీటిని విడుదల చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఎడమకాల్వకు నీటిని విడుదల చేస్తే రైతులు పంటకాల్వలకు ఉపయోగించుకుంటారన్న ఉద్దేశ్యంతో నీటివిడుదల చేయడంలేదు. ఎడమకాల్వకు నీటిని విడుదల చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో పదిరోజుల క్రితం జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో సాగర్ సిఇ కార్యాలయం ముట్టడి చేపట్టారు. తాజాగా ఎడమకాల్వకు నీటిని విడుదల చేయకపోతే నిరాహార దీక్షలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించినా మరుసటిరోజే కుడికాల్వకు తాగునీటిని విడుదల చేయడం వివాదాస్పదం కానుంది. డ్యాం అధికారులు బుధవారం ఉదయం 9:30 నుండి కుడికాల్వకు నీటిని విడుదల ప్రారంభించారు. ప్రస్తుతం 6,200 క్యూసెక్కుల నీటిని కుడికాల్వ ద్వారా ఆంధ్రాప్రాంతానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుండి 4,507 క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయానికి చేరుకుంటుంది. ఎస్‌ఎల్‌బిసికి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 510.10 అడుగుల నీటిమట్టం ఉండగా శ్రీశైలంలో 804 అడుగుల నీటిమట్టం ఉంది.
సోమవారం నుండి నిరాహార దీక్షలు: జూలకంటి
ఎడమకాల్వకు నీటిని విడుదల చేసి నల్లగొండ ప్రజలకు దాహార్తిని తీర్చాలని గత రెండునెలలుగా ఆందోళన చేపడుతున్నా నీటి విడుదల విషయంలో డ్యాం అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం నేత జూలకంటి ఆవేదన వ్యక్తం చేశారు.
కుడికాల్వకు మూడోసారి తాగునీటిని విడుదల చేయడాన్ని నిరసనగా సోమవారం నుండి సాగర్‌లోని పైలాన్ పిల్లర్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నీటివిడుదలకై నిరాహారదీక్షలు చేపడుతున్నట్లుగా సిపిఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అన్నారు.