రాష్ట్రీయం

నాడు తుపాకుల మోత.. నేడు మైకుల రొద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 5: ఎన్నికలు వచ్చాయంటే చాలు వివిధ పార్టీల్లో కీలకంగా మెలిగే నాయకులు నాడు గ్రామాలు వదిలి వెళ్లాలంటే హడలెత్తి పోయావారు. ఎప్పుడు ఎక్కడ తుపాకుల మోత వినిపిస్తుందో.. ఎలాంటి సమాచారం వింటామోననే ఆందోళనలు ఉండేవి.. కానీ ప్రస్తుతం పూర్తిగా భిన్నంగా పరిస్థితులు మారిపోయాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ ఈ మూడు నియోజవర్గాలలో నాటి పరిస్థితులు నేతలను భయం గుప్పిట్లోకి నెట్టాయి. నాడు తూపాకుల మోత వినిపించే ప్రాంతాలలో నేడు మాత్రం నాయకులు ఏర్పాటు చేసుకున్న ఎన్నికల ప్రచార రథాల మైకుల మోత హోరుతో హుషారుగా నేతలు నల్లమల అటవీ ప్రాంతంలోని లోతట్టు గ్రామాల్లో కూడా ప్రచారానికి వెళ్లి వస్తున్నారు. 1991 నుండి 2006 వరకు నల్లమల అటవీ ప్రాంతాల గ్రామాల్లో పోలీసుల మధ్య మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఎదురు కాల్పులు అందులో నాయకులను కూడా టార్గెట్‌గా చేసుకుని మావోయిస్టులు జరిపే కాల్పులు అయా గ్రామాల ప్రజలను భయం గుప్పిట్లోకి నెట్టిన రోజులు అవి. నల్లమల అంటేనే భయపడే రోజుల నుండి భయటపడి తాము అనుకున్న రీతిలో ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చనే ధీమాతో నాయకులు ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. నాటి పరిస్థితులు భయానకమైనవి. నేటీ పరిస్థితులు స్వేచ్ఛగా అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ ప్రచార రథాలను తీసుకుని నల్లమల అటవీ ప్రాంతంలోని గ్రామాలకు వెళ్తున్నారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ఇంటింటి ప్రచారం చేస్తుడటంతో అక్కడ పండుగ వాతావరణం కనపడుతుంది. ఇంటింటికీ వచ్చి ఓట్లు అడుగుతున్న నేతలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను తెలియజేసుకుంటున్నారు. అయితే, మహిళలు కూడా అటవీ ప్రాంతంలోకి వచ్చి ప్రచారం చేస్తుడటం వల్ల అయా గ్రామాల్లో ఏనాడూ ఎన్నికల సమయంలో భయటకు వచ్చి ప్రచారానికి రాని మహిళలు నేడు ప్రచారంలో పాల్గొనటం విశేషం. అంతేకాకుండా నల్లమలలోని చెంచుపెంటల్లోకి సైతం నాయకులు వెళ్లి తమతమ పార్టీల తరపున ప్రచారాలు నిర్వహించుకుంటున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు పట్టున్న గ్రామాలు ఇక్కడ వందల సంఖ్యలో ఉండేవి. అక్కడికి ఎన్నికల సమయంలోగానీ, మామూ లు రోజుల్లోగానీ నాయకులు వెళ్లే వారుకాదు. కానీ 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల పుణ్యమా అంటూ నేతలు మాత్రం ఎన్నడులేని విధంగా నల్లమల ప్రాంతంలోని గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, తెరాస, బీజేపీ, టీడీపీ, బీఎల్‌ఎఫ్, స్వతంత్రంగా పోటీ చేసే నాయకులు అయా గ్రామాల్లో నువ్వానేనా అనే రీతిలో ప్రచారం చేస్తూ నల్లమలలోని గ్రామాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో గతంలో మావోయిస్టుల ప్రాబల్యం బాగా ఉండేది. కానీ ప్రభుత్వాలు, పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల మావోయిస్టు కదలికలు పూర్తిగా లేకపోవడంతో ఈ ఎన్నికల్లో మాత్రం నాయకులు శే్వచ్చగానే ప్రచారం చేస్తున్నారని చెప్పవచ్చు. అయిన్నప్పటికీ పోలీసులు మాత్రం అప్రమత్తంగానే ఉంటూ నల్లమల అటవీ ప్రాంతంపై గట్టినిఘాను ఉంచారు. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి గ్రామాల్లో నిఘాను ఉంచారు. నల్లమల అటవీ ప్రాంతంలోని అయా గ్రామాలకు వెళ్లే రహదారులన్నింటినీ మాత్రం తమ ఆధీనంలోకి తీసుకుని నిరంతరంగా తనిఖీలు చేస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు మాత్రం నిఘాను పూర్తి స్థాయిలో ఉంచారు. ఏమైనా నల్లమల అటవీ ప్రాంతం లో మాత్రం నాటి పరిస్థితులకు భిన్నంగా నేడు అన్ని రాజకీయ పార్టీ నాయకులు మాత్రం స్వేచ్ఛగా తమ తమ పార్టీల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడం విశేషం.