రాష్ట్రీయం

రాజకీయ కేంద్రంలో హోరాహోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, నవంబర్ 5: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే రాజకీయ కేంద్రమైన నిర్మల్‌లో ఈసారి హోరా హోరీ పోరు తప్పేలా లేదు. రాజకీయ ఉద్దండులకు నెలవైన నిర్మల్‌లో అన్ని పార్టీల నుండి బలమైన అభ్యర్థులు పోటీలో నిలవడంతో వచ్చే ఎన్నికలపై ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి తాజా మాజీ ఎమ్మెల్యే, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీ ఆర్ అసెంబ్లీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన మీడియా సమావేశంలోనే తొలిజాబితాను సైతం విడుదల చేయడంతో మంత్రి అల్లోలకు టికెట్ ఖరారైంది. దీంతో ఆయన వెంటనే ప్రచారంలోకి దిగడతో అందరికంటే ముందు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో కలిసి నిర్మల్ పట్టణంతోపాటు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ, పార్టీలో యువకులను, వివిధ పార్టీల కార్యకర్తలను, నాయకులను టీ ఆర్ ఎస్‌లో చేర్చుకుంటూ ప్రత్యర్థి పార్టీల నాయకులకు కునుకులేకుండా చేస్తున్నారు. గత నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీ ఆర్ అమలుచేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని ఉదృతంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపొందితే చేపట్టబోయే పథకాలను వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ ఓట్లు వేయాలని కోరుతున్నారు. నిర్మల్ మున్సిపల్ చైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి, పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పట్టణంలో టీఆర్‌ఎస్‌కు ఇబ్బందులు తప్పవని భావించినప్పటికి, దానిని పూడ్చుకునేందుకు మంత్రితోపాటు టీఆర్‌ఎస్ అగ్ర నేతలు పట్టణంలోని అన్ని వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ పట్టణ ప్రజల మద్దతును కూడగట్టే యత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి అధికారికంగా టికెట్ ఖరారు కానప్పటికి ఆయనకు ఇక్కడ కాంగ్రెస్ నుండి పోటీదారు లేకపోవడంతో మహేశ్వర్‌రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లేనని అంటున్నారు. దీనికితోడు ఆయన ప్రచారం లోసైతం దూసుకుపోతున్నారు. పార్టీలో అందరికంటే ముందే చేరికలను ప్రోత్సహిస్తూ అన్నివర్గాల ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మల్ మున్సిపల్ చైర్మెన్‌తోపాటు 20 మంది కౌన్సిలర్లు టీ ఆర్ ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం ఆయనకు కొండంత బలంగా మారింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గం నుండి మరోసారి గెలుపొందాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే అనూహ్యంగా తెరమీదకి వచ్చిన డాక్టర్ స్వర్ణారెడ్డికి బీజేపీ టికెట్‌ను ఖరారుచేయడంతో వీరిద్దరికి ఏమాత్రం తీసిపోని విధంగా స్వర్ణారెడ్డి తన ప్రచార పర్వాన్ని ఉదృతం చేస్తున్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ దివంగత అయిండ్ల భీంరెడ్డి కూతురైన డాక్టర్ స్వర్ణారెడ్డి ఇప్పటికే గడప గడపకు స్వర్ణమ్మ పాదయాత్ర పేరుతో నియోజకవర్గంలోని అన్ని మండలాలను చుట్టివచ్చారు. ఇంటింటికి తిరుగుతూ ఒక మహిళగా తనను గెలిపించాలని కోరుతున్నారు. అయిండ్ల భీంరెడ్డి ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో ప్రధానంగా రూ.15 లకే భోజనం, అమ్మ ఫార్మసి ద్వారా తక్కువ ధరలకే మందుల సరఫరా, రక్తదాన శిభిరాలు లాంటి కార్యక్రమాలతో ఆమె ప్రజలకు మరింత చేరువయ్యారు.

చిత్రాలు.. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి *ఏలేటి మహేశ్వర్‌రెడ్డి *డాక్టర్ స్వర్ణారెడ్డి