రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే..మజ్ల్లిస్‌కు వేసినట్లే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్ (కంఠేశ్వర్), నవంబర్ 5: ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తే, అది మజ్లీస్‌కు వేసినట్లేనని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ప్రగతినగర్ మున్నూరుకాపు కల్యాణ మండపంలో నిర్వహించిన బీజేపీ జన సంఘటన ర్యాలీ, సభ నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డీ.శ్రీనివాస్‌ను రెండు పర్యాయాలు ఓడించిన ఘనత ప్రస్తుత అర్బన్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణకే దక్కిందన్నారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లోనూ అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ పార్టీ అని, ఆ పార్టీలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ కవితలదే పెత్తనం కొనసాగుతోందని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎలాంటి విలువలేకుండాపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు తన కుమారుడిని అందలం ఎక్కించి కుటుంబ పాలనకు తెర తీశారని, కాంగ్రెస్ పార్టీలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీతో పాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీలోనే కుటుంబ పాలన లేదని, రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ కుటుంబ పాలనను అంతమొందించి, బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. నేడు జరిగిన బీజేపీ సభకు మైనార్టీ మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చారని, అందుకు కారణం మోడీ సర్కార్ తలాక్‌ను ఎత్తివేయడమేనని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, బీజేపీ మాత్రం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తోందన్నారు. బీజేపీ సబ్‌కా సాత్ - సబ్‌కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తోందని అన్నారు.
మోడీ సర్కార్ దేశంలో అభివృద్ధిని చేస్తుంటే, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కలెక్షన్లు చేస్తున్నారని దత్తాత్రేయ ఆరోపించారు. టీఆర్‌ఎస్ సర్కార్ లక్ష్యలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఇళ్లను నిర్మించిన ఇచ్చిన పాపానపోలేదన్నారు. కేంద్రం, రాష్ట్రానికి లక్షా 30వేల ఇండ్లను కేటాయించిందని, వీటిని టీఆర్‌ఎస్ సర్కార్ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లుగా మార్చి, తమవిగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ వ్యవహార శైలి సొమ్ము ఒక్కడిది, సోకు ఒకడిది అన్నట్లుగా ఉందన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, రాష్ట్రం బంగారు తెలంగాణగా కాకుండా మద్యం తెలంగాణగా తయారైందన్నారు. ఈ మద్యం వ్యాపారం వల్ల 20వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం సమకూర్చుకుంటోందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మద్యపానాన్ని అరికడ్తామని అన్నారు.

చిత్రం..నిజామాబాద్‌లో బీజేపీ జన సంఘటన ర్యాలీలో పాల్గొన్న దత్తాత్రేయ