రాష్ట్రీయం

మొబైల్ ఫోన్లంటే హడల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: ఈ ఎన్నికల్లో రాజకీయ నాయకులు, అభ్యర్థులు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. రాజకీయ వ్యూహాలు, ప్రతి వ్యూహాల గురించి స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం లేకుండా పోయింది. తమ ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఇప్పటికే మహాకూటమి నేతలు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విపక్ష నేతలు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించి, ఎవరి ఫోన్లనైనా ట్యాపింగ్ చేస్తున్నట్టు అయితే ఆ వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్ డీజీపీని నివేదిక కోరారు. తామెవ్వరీ ఫోన్లను ట్యాప్ చేయడం లేదని, కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు సంఘ విద్రోహుల, దేశ భద్రతకు సంబంధించిన అంశాలపైనే ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్టు డీజీపి ఇచ్చిన వివరణతో ఎన్నికల కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, విపక్ష నేతలను సంతృప్తి పర్చలేకపోయింది. ఎవరైతే తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తోన్నట్టు ఫిర్యాదు చేసారో, వారినే ఎన్నికల కమిషన్ వివరణ కోరడంతో నివేదిక కోసం వేచి చూడాల్సిన అవసరమే లేదు. వారు ఎలాగు ట్యాపింగ్ చేయడం లేదనే సమాధానం ఇస్తారనే విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ఇలా ఉండగా తమ ఫోన్ల ట్యాపింగ్ సమస్యకు పరిష్కారం లేదని గ్రహించిన నేతలు, అభ్యర్థులు ట్యాపింగ్ సమస్యకు కొత్త చిటుకను కొనుగొన్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల నేతలు, అభ్యర్థులు వాట్సప్ ద్వారా కాల్స్ చేస్తున్నట్టు సమాచారం.