ఆంధ్రప్రదేశ్‌

టార్గెట్ 21!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 23: 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే, ఒక్కపూటలో ప్రభుత్వాన్ని కూల్చేస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అథినేత జగన్ అన్నారో? లేదో? తెలియదు కానీ, తెలుగుదేశం పార్టీ దీన్ని ఒక సవాలుగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఆ 21 మంది ఎమ్మెల్యేలను వైకాపా నుంచి తమ పార్టీలోకి తీసుకురావాలన్న ఆలోచనలో టిడిపి అథినేత ఉన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను మరింత ప్రణాళికాబద్ధంగా చేపట్టనున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొద్ది రోజుల కిందట ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు ఆరంభమయ్యాయి. ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అది సాధ్యం అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీనికితోడు రోజా వ్యవహారం ముదిరి పాకాన పడింది. రోజా వివాదం రోజుకొక మలుపు తిరుగుతూ వస్తోంది. రోజా విషయంలో పార్టీ అథిష్ఠానం అనుసరిస్తున్న వైఖరిని ఆ పార్టీ ఎమ్మెల్యేలే తప్పుపడుతున్నారు. రోజా వివాదం వలన పార్టీకి ఇమేజ్ పెరిగిందా? డేమేజ్ అయిందా? అన్న విషయం వైకాపా ఎమ్మెల్యేలకే అర్థం కావడం లేదు. ఇక, శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడల్లా, మీ నాయకుడు సక్రమంగా లేడు, మీరైనా మారండి.. మా వైపు రండి అంటూ పరోక్షంగా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. వెంటనే ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. జగన్ ఏ 21 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని పడగొడతానని సవాల్ విసిరారో, అదే 21 మంది ఎమ్మెల్యేలు వైకాపా నుంచి టిడిపిలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కొంతమంది టిడిపి ఎమ్మెల్యేలు ఆబాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎనినిమిది మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. వచ్చే నెలలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలను టిడిపిలోకి తీసుకువెళ్లడానికి వ్యూహాన్ని సిద్ధం చేశారు.
కొద్ది నెలల్లోనే తాము 21 మంది ఎమ్మెల్యేలను తీసుకువెళతామని, తమ లక్ష్యం పూర్తయిన తరువాత, ఆపార్టీ నుంచి ఎంతమంది వచ్చినా తమకు అభ్యంతరం లేదని టిడిపి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల వైకాపా నుంచి టిడిపిలోకి వెళ్లిన భూమా నాగిరెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం ద్వారా వైకాపా నుంచి మరికొంతమందిని ఆకర్షించాలన్న ఉద్దేశంలో టిడిపి అథిష్ఠానం ఉన్నట్టు భోగట్టా.