రాష్ట్రీయం

కేసీఆర్, చంద్రబాబు ఒకే తాను ముక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: కేసీఆర్, చంద్రబాబునాయుడు ఇద్దరూ కాంగ్రెస్ స్కూల్ నుండి వచ్చిన వ్యక్తులేనని, ఒకే తాను ముక్కలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ సమక్షంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు హుస్సేన్ నాయక్, కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మీ, శీలం సత్యనారాయణ తదితరులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల తర్వాత మహాకూటమి డ్రామా కంపెనీలో కేసీఆర్ కూడా చేరడం గ్యారంటీ అని అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోమని కుమారస్వామికి సలహా ఇవ్వడమే అందుకు నిదర్శమని అన్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కాంగ్రెస్ సంస్కృతి నుండి విముక్తి పొందడమేనని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధుల పేర్లను చంద్రబాబునాయుడు నిర్ణయించడం వారి ధైన్యస్థితికి అద్దం పడుతోందని అన్నారు. తెలంగాణలో అంతో ఇంతో మిగిలిన ఉన్న కాంగ్రెస్ పూర్తిగా టీడీపీ కబంధ హస్తాల్లో చిక్కుకు పోయిందని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కోదండరాం లాంటి మేధావి తెలంగాణ ద్రోహుల పార్టీ లాంటి టీడీపీతో జతకలవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఉద్యమ సమయంలో టీడీపీని తీవ్ర స్థాయిలో విమర్శించిన వ్యక్తి ఇపుడు ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్ ఈ మూడింటిలో ఏ పార్టీకి ఓటు వేసినా దారుస్సలాంలో ఉన్న ఎంఐఎంకే వెళ్తుందని తేల్చి చెప్పారు.
టీఆర్‌ఎస్ అభ్యర్ధులు ఎన్నికల ప్రచారానికి వెళ్తే చుక్కలు చూపిస్తున్నారని, హామీలు నెరవేర్చని మీరు ఓట్లు అడిగేందుకు ఎందుకు వచ్చారని నిలదీస్తున్నారని అన్నారు. ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారని, ప్రజలు బ్రహ్మరథం పుడుతున్నారని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. మిషన్ -60 పేరుతో పంచ పాండవుల్లా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని లక్ష్మణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.