రాష్ట్రీయం

తెలుగు లోగిళ్లు ఆనందమయం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 6: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు లోగిళ్లలో ఆనందమయ కాంతులు వెదజల్లాలని ఆకాంక్షించారు. కార్తీక దీపకాంతులకు నాందిపలికే దీపావళిని సంబరంగా స్వాగతించాలన్నారు. తెలుగు ప్రజలందరికీ సర్వ శుభాలు, శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆశకు, జ్ఞానానికి, ఆనందానికి, వికాసానికి, విజయాలకు దీపావళి ప్రతిరూపమని, దీపావళి అంటే దీపాల వరుస అని ఆంధ్రప్రదేశ్‌కు విజయాల వరుస కావాలని అభిలషించారు.