రాష్ట్రీయం

నేతల తలరాతలను మార్చనున్న గల్ఫ్ కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, నవంబర్ 18: ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర శాసనసభ ముందస్తు ఎన్నికలలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ నేతలు తమకు ఆయా ఓట్లను అనుకూలంగా మార్చకునే దిశగా చర్యలు చేపట్టారు. దీపావళి వేడుకలను యూఏఈ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండగా, గల్ఫ్ ప్రవాస మిత్రబృందం ఆధ్వర్యంలో ప్రత్యేకించి, శుక్రవారం తెలంగాణ ధూంధాం కార్యక్రమం స్వయంగా, స్వచ్ఛందంగా నిర్వహిస్తోంది. తెలంగాణవాసుల ద్వారా ఆహ్వానించ బడిన ఏఐసీసీ నేత కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్, నిజామాబాద్ మాజీ ఎంపీ యాష్కీ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జగిత్యాల తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు శుక్రవారం సాయంత్రం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనున్నారు. వాస్తవానికి అరబ్ గల్ఫ్ దేశాలైన సౌదీ, యూఏఈ, ఒమాన్, బహరేన్, కువైట్, ఖతార్‌ల తదితర ప్రాంతాలలో 10లక్షల మంది తెలంగాణ కార్మికులు జీవనోపాధి కోసం వసల వెళ్ళారు. ఈ 10లక్షలపై ఆధారపడిన కుటుంబాలలో దాదాపు 40లక్షలకు పైగా ఓటర్లు, 25శాసనసభ నియోజకవర్గాలపై ప్రభావం చూపనున్నారు. బొంబాయి - దుబాయి - బొగ్గుబాయి నినాదంతో తెలంగాణ వలస కార్మికుల స్థితి గతుల గురించి ఉద్యమ సమయంలో పదేపదే వల్లించిన తెరాస నేతలు అధికారంలోకి వచ్చాక వారిని మరిచారు. గత నాలుగేళ్ళ కాలంలో గల్ఫ్ కార్మికుల గురించి యోచించని విషయాన్ని గురు చేస్తున్నారు. తెరాస ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఒత్తిళ్ళ అనంతరం 100కోట్లు కెటాయించినా, సదరు నిధులను ఖర్చు చేయని అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. 10లక్షల మంది తెలంగాణ కార్మికులు ప్రతి నెలా 1500కోట్ల విదేశీమారక ద్రవ్యాన్ని మాతృదేశానికి పంపిస్తూ, దేశ రాష్ట్ర అభివృద్ధికి చేయూతను అందిస్తున్నారు. గల్ఫ్ ఎన్‌ఆర్‌ఐల ద్వారా 18వేల కోట్ల ధనం తెలంగాణకు వస్తుండగా, పరోక్షంగా 5-6శాతం స్థానిక పన్నుల రూపేణ ఏటా 1000కోట్ల ఆదాయం పొందడం జరుగుతున్నది. తెరాస ఈసారి ఎన్నికలలో గెలిచాక, గల్ఫ్ కార్మికులకు న్యాయం చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, 100రోజుల లోపు సమగ్ర ఎన్‌ఆర్‌ఐ పాలసీని ప్రకటిస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ స్వయంగా కామారెడ్డి సభలో ప్రకటించారు. గల్ఫ్‌లో రాచరిక పాలన నేపథ్యంలో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం నిషేధం. అందుకే గల్ఫ్ కార్మికుల పట్ల కాంగ్రెస్ వైఖరి, తాము అమలు చేయబోయే కార్యక్రమాల గురించి, వ్యూహాత్మకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే మీడియా ముఖంగా స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 100రోజులులలో ఎన్‌ఆర్‌ఐ పాలసీ ప్రకటిస్తామని, అక్కడి కార్మికుల సంక్షేమం కోసం ఏటా 500కూట్లు కెటాయిస్తామని, గల్ప్‌లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా (మృత ధనసాయం) అందిస్తామని, కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని, కార్మికుల పేర్లను ఇక్కడి రేషన్ కార్డుల్లో కొనసాగిస్తామని, ప్రదామ, ఆరోగ్య బీమా, పెన్షన్లు, ‘‘ప్రవాసీ యోగ క్షేమ’’ పథకం ప్రవేఫ పెడతామని స్వదేశాలలో పునరావాసం, పునరేకీకరణలకు ఆర్థిక సాయం అందిస్తామని, ‘‘గమ్కా’’ మెడికల్ చెక్‌అప్ ఛార్జీలకు 4నుండి 5వేలు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని, ఎంబసీలో తెలుగు అధికారులను నియమిస్తామని మరెన్నో కార్యక్రమాలను పీసీసీ చీఫ్ ‘‘కాంగ్రెస్ గల్ఫ్ మేనిఫెస్టో - గల్ఫ్ భరోసా’’ పేరుతో ప్రకటించారు. గురువారం రాత్రి శంషాబాద్ నుండి బయలుదేరి వెళ్ళి, శుక్రవారం కాంగ్రెస్ స్టాల్వార్ట్స్ ఉదయం చేరుకుని, సభలూ, సమావేశాలు నిషిద్ధం కనుక, కార్మిక సంఘాల నేతలతో, ప్రతినిధులతో ఈ అంశాలపై చర్చిస్తారు.
సాయంత్రం షెడ్యూల్డు కార్యక్రమంలో పాల్గొని శనివారం ఉదయానికి కల్లా తిరిగి వస్తారు. గల్ఫ్‌లో ఉండే 10లక్షల మందికి తెలంగాణలో ఓట్లు లేకున్నా, వారిపై ఆధార పడే 40లక్షలకు పై చిలుకు ఓటర్లను ఆకర్షించడానికి ఈ పర్యటనను కాంగ్రెస్ నేతలు వేదికగా వినియోగించుకునే పనిలో నిమగ్నమయ్యారు.