రాష్ట్రీయం

జగన్ పిటిషన్లపై 13న విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తనపై జరిగిన హత్యాయత్నం కేసులో దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు ఈనెల 13న విచారించనుంది. అలాగే ఈ కేసులో విచారణకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక కూడా అదే రోజు హైకోర్టుకు మందుకు రానుంది. దీంతో ఈ రెండు కేసులకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. ఒకే సంఘటనపై ఇరుపక్షాలు తమ వాదనలను వినిపిస్తున్నందున హైకోర్టు ధర్మాసనం నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఇరుపక్షాల్లో ఉత్కంఠ నెలకొంది. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును బలహీన పరిచేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైఎస్సార్ సీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. తనపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని వైఎస్ జగన్ మరో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్‌తో పాటు ఇదే అంశంపై ఆపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్, విశాఖపట్నం విమానాశ్రయంలో భద్రతా లోపాలపై దాఖలయిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై మంగళవారం ధర్మాసనం విచారణ చేస్తోంది. ప్రభుత్వం నియమించన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ఏమేరకు పురోగతి సాధించిందీ నివేదికను సీల్డ్ కవర్‌లో 13వ తేదీన కోర్టుకు సమర్పించాలని ఏపీ అడ్వొకేట్ జనరల్‌ను ధర్మాసనం ఇంతకు ముందే ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణపై వ్యక్తమవుతున్న అనుమానాలను హైకోర్టు అడిగి తెలుసుకుంది. వైఎస్ జగన్మోహనరెడ్డి తరుపున సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తుండగా, ప్రభుత్వం తరుఫున దమ్మలపాటి శ్రీనివాస్ వాదిస్తున్నారు.