రాష్ట్రీయం

ఆ పొత్తు అనైతికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: రాష్ట్రంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కుటుంబ పాలన కోసమేనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందీ? అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ మీనాక్షి లేఖి విమర్శించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్‌కు జత కలవడం అనైతికమని ఆమె అన్నారు. కుటుంబ పార్టీలు తమ కుటుంబాల కోసం కూటమిగా ఏర్పడ్డాయని ఆమె విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్ పోటీ చేస్తున్న ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో శుక్రవారం ఆమె పాదయాత్ర చేశారు. ఆ నియోజకవర్గంలో పలు గ్రూపు సమావేశాల్లోనూ పాల్గొని స్థానికులకు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అవశ్యకత గురించి వివరించారు. అనంతరం ఆమె లక్ష్మణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్-టీడీపీని తూర్పారబట్టారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావుమరణిస్తే, పార్థీవ దేహం పూర్తిగా దహనం కాకపోయినా పట్టించుకోలేదని విమర్శించారు. మరణించాక కూడా అవమానించిందని ఆమె కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ఆమె పిలుపునిచ్చారు. 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం నెలకొల్పుతామని, దళితున్ని సీఎం చేస్తామని తదితర హామీలు ఏమయ్యాయని ఆమె కేసీఆర్‌ను ప్రశ్నించారు.
ఉత్తమ్‌పై కేసు నమోదు చేయాలి
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యేసు రాజ్యం ఏర్పాటు అవుతుందని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై ఈసీ సుమోటోగా కేసు నమోదు చేయాలని మీనాక్షి లేఖి డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో రామ రాజ్యం అని ఉందే తప్ప యేసు రాజ్యం అని లేదన్నారు. శబరిమల సంస్కృతిని, అందులోని గొప్పదనాన్ని అర్థం చేసుకోలేని వారు మాత్రమే వివాదం చేస్తున్నారని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.