రాష్ట్రీయం

దుబాయిలో ఉత్తమ్, కుంతియా బిజీ బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ శుక్రవారం దుబాయిలో బిజీబిజీగా గడిపారు. దుబాయి విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు నేరుగా దుబాయిలో వలస కార్మికుల శిబిరాలను సందర్శించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను కార్మికులు వివరించి, బాధను వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలు అధికంగా నివాసం ఉండే ప్రాంతాలనూ వారు సందర్శించారు. తెలంగాణలోని బంధుమిత్రులకు ఫోన్ల ద్వారా మహాకూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరాలని చెప్పారు. శనివారం కూడా పలువురు ముఖ్యులను కలిసి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

సంక్షేమంపై సూచనలివ్వండి
ధర్మపురి: గల్ఫ్ ప్రవాసి మిత్ర బృందం నిర్వహించిన తెలంగాణ దీపావళి ధూం ధాం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షులు కేప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి, జగిత్యాల తాజామాజీ శాసనసభ్యులు తాడిపర్తి జీవన్ రెడ్డి, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తదితరులు లేబర్ క్యాంపులకు స్వయంగా వెళ్ళి, ప్రవాసీ కార్మికుల స్థితి గతుల, జీవన విధానాల, పని భారాల గురించి విపులంగా తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికై చేయదగిన కార్యక్రమాల గురించి, తగు సూచనలు, సలహాలు అందించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. గల్ఫ్ దేశాలలో సెలవుదినమైన శుక్రవారం తెలంగాణ వలస కార్మికులు నివసించే అల్‌గెసిస్ (సోనాపూర్), అల్‌కోజ్ (తాబుక్), ప్రాంతాలలోని లేబర్ క్యాంపులను (వలస కార్మిక ఆవాస ప్రాంతాలను) నాయకులు సందర్శించారు.