రాష్ట్రీయం

దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కలెక్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం
అమరావతి, నవంబర్ 9: దేశానికే అర్బన్ హౌసింగ్ ప్రతిష్టాత్మకం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. శుక్రవారం పట్టణ గృహనిర్మాణంపై జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు, బ్యాంకర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లక్షలాది పేద కుటుంబాల కలల ప్రాజెక్ట్ పట్టణ గృహ నిర్మాణమన్నారు. రాష్ట్రంలో 39వేల 427 కోట్ల రూపాయలతో 9లక్షల 58వేల 230 ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇందులో కేంద్రం వాటా రూ 7వేల 946 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం 13వేల 407కోట్లు భరిస్తుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల వాటా కింద రూ 5వేల 800 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ సమాజానికి అతిపెద్ద సంపద అవుతుందన్నారు. పట్టణ పేదలకు సొంతింటి కల నిజం చేసేందుకు దేశంలోనే ఉత్తమ ఏజెన్సీలను గుర్తించామన్నారు. రెండు, మూడు స్థాయిలలో క్వాలిటీ కంట్రోల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 15 లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ లాటరీ 22 కల్లా పూర్తిచేయాలన్నారు. మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు నవంబర్ 30 కల్లా ముమ్మరం చేయాలని నిర్దేశించారు. ఎమ్మెల్యేలు ఇందుకు బాధ్యత వహించాలన్నారు. కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. లాటరీ ద్వారా ఎంపికచేసి మీడియా సమక్షంలో పారదర్శకంగా అమలు చేయాలని వివరించారు. ఎలాంటి లోపాలు ఉత్పన్నం కారాదని, తప్పుచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాజెక్ట్ ప్రారంభంలో ఉన్న శ్రద్ధ పూర్తిచేయటంలో చూపడంలేదని అసహనం వ్యక్తంచేశారు. రెవెన్యూ, మునిసిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. డిసెంబర్ 15న లక్ష ఇళ్ల గృహప్రవేశాలు వేడుకగా జరపాలన్నారు. మన ఇళ్ల నిర్మాణం ఇతర రాష్ట్రాలకు ఒక నమూనాగా ఉండాలన్నారు. 7 రాష్ట్రాల ప్రతినిధి బృందాలు చూసి ప్రశంసించారని, ఇళ్లు చూడగానే ఆహ్లాదకరంగా ఉండాలన్నారు. ఎందులోనూ రాజీపడే ప్రసక్తే లేదన్నారు. రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రెయినేజీ, ఇతర వౌలిక సదుపాయాలను పూర్తి చేయాలన్నా రు. ఇప్పటినుంచే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని స్ప ష్టం చేశారు. యజమాని దగ్గరుండి ఇంటి పనులు చూసుకోవాలని ఇంటితో అనుబంధం పెంచుకునేలా చేయాలన్నారు. మొత్తం ప్రాజెక్ట్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని గేటెడ్ కమ్యూనిటీ ప్లస్ తరహాలో ఇళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిచేసి ఇళ్లకు దగ్గరలనే ఆర్థిక లావాదేవీలు జరిగేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. మంత్రులు పి నారాయణ, కాలువ శ్రీనివాసులు, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి కరికాల వలవన్, ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మునిసిపల్ కమిషనర్లు టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.