రాష్ట్రీయం

జగన్‌పై దాడి కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 9: విపక్ష నేత జగన్‌పై దాడి కేసులో నిందితుడు జే శ్రీనివాస్‌కు న్యాయస్థానం మరోసారి రిమాండ్ విధించింది. గత నెల 25న విశాఖ విమానాశ్రయంలో విపక్ష నేత జగన్‌పై కోడి కత్తితో దాడిచేసి పట్టుబడిన శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని 26న కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 8 వరకూ రిమాండ్ విధించారు. ఇదే క్రమంలో నిందితుడు శ్రీనివాస్‌ను విచారించాలని, కస్టడీకి అనుమతివ్వాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా, ఈ నెల 23 వరకూ కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. గడువుముగిసిన అనంతరం మరోసారి నిందితుడిని కస్టడీకి కోరగా నిరాకరించిన న్యాయస్థానం రిమాండ్ విధించింది. రిమాండ్ గడువు పూర్తి కావడంతో నిందితుడు శ్రీనివాస్‌ను శుక్రవారం ఉదయం విశాఖలోని మూడవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. నిందితుడు శ్రీనివాస్‌కు మ రో 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూ ర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా శ్రీనివాస్ తరపున న్యాయవాది సలీమ్ తన క్లైంట్ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణ కు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తా ము వేసిన బెయిల్ పిటిషన్ పీపీ నోటీసులో ఉందన్నారు. నిందితునికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించినట్టు సలీమ్ వెల్లడించారు.