రాష్ట్రీయం

తిరుచానూరులో శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాద కేంద్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తోళప్ప గార్డెన్స్‌లో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాద కేంద్రాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా చైర్మన్ మీడియాతో రూ. 6.70 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నప్రసాద పథకాన్ని 1985 ఏప్రిల్ 6న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించారని చెప్పారు. రోజుకు 2వేల మంది భక్తులతో ప్రారంభించి, నేడు రోజుకు సరాసరి 1.50లక్షల మందికిపైగా భక్తులు ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు ఇప్పటి వరకు రూ. 1021.29 కోట్లను విరాళంగా అందించిన దాతలకు, రోజుకు 7 టన్నుల మేరకు కూరగాయలను విరాళంగా అందిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరో 2 అంతస్తులు నిర్మించేందుకు వీలుగా ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ మాట్లాడుతూ తిరుచానూరులో రోజుకు 3వేల నుంచి 5వేల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారని తెలిపారు. మొదటి ఫ్లోర్‌లో 500 మంది, రెండో ఫ్లోర్‌లో 1000 మంది కలిపి మొత్తం 1500 మంది భక్తులు కూర్చొని అన్నప్రసాదాలు స్వీకరించేందుకు వీలుందన్నారు. ఒక్కో ఫ్లోర్‌లో 170 మంది వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సెల్లార్‌లో స్టీమ్ బాయిలర్లు, బియ్యం, పప్పులు, కూరగాయలు, పాత్రలు నిల్వ ఉంచుకునేందుకు గదులున్నాయని, అంతకుముందు అన్నప్రసాద భవనంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ చైర్మన్, టీటీడీ జేఈఓ కలిసి వంటశాల, భోజనశాలలను పరిశీలించారు. తిరుమలలోని అన్నప్రసాద భవనం తరహాలో ఇక్కడ కూడా భక్తులు కూర్చొనేందుకు వీలుగా కుర్చీలతో కూడిన స్టీల్ టేబుళ్లను ఏర్పాటుచేశారు.