తెలంగాణ

ఘనంగా గో తులాభారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 20: హిందు సంప్రదాయం ప్రకారం రాష్ట్రంలోనే మొదటి సారిగా గోతులాభారాన్ని శుక్రవారం ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. సంస్కృతి, సాంప్రాదాయాలను తెలియ చేస్తూ గోవుల ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై భక్త్భివాన్ని చాటుకున్నారు. గోవుకు అత్యంత ప్రీతిపాత్రమైన దాణాతో తులాభారాన్ని నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర గోశాల నిర్వాహాకులు ఆరుట్ల శ్రీనివాసచార్యులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కపిలవాయి అచ్యుతరామారావు చేసిన ప్రవచనాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గోపూజ, గోదానం, గోవులకు ఇష్టమైన దాణాను ఇవ్వడం హిందువుల సాంప్రదాయం. ఈ తులాభారంలో పాల్గొన్న వందలాది మంది భక్తులు నల్లనువ్వులు, కందులు, బొబ్బర్లు, గోధుమలు, మినుములు, ఉలవలు, పెసలు, శెనగలు, బెల్లం వంటివాటిని సమర్పించుకున్నారు. అలాగే గోతులాభారాన్ని చూసినా గ్రహస్ధితి అనుకూలించి పితృదోష నివారణ, సంతాన సమస్య, కుటుంబ సమస్యలు, నరదృష్టి, వివాహా, ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వేలాది మంది భక్తులు జిల్లా నలు మూలల నుండి బారీగా తరలి వచ్చారు. 525 కేజీల బరువుకల్గిన గోమాతకు అదే బరువు కల్గిన దాణాను ముగ్గురు భక్తులు సమర్పించారు. ముందుగా ఉదయం 5:30 గంటలకు సుప్రభాతసేవ, ఆరాధనలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 8 గంటల నుండి స్వస్తివాచనం, చతుస్తానార్చన, శ్రీ లక్ష్మీనారాయణ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి.

ఖమ్మం పట్టణంలో గోతులాభారం నిర్వహిస్తున్న దృశ్యం