రాష్ట్రీయం

తెలంగాణలో పోటీకి జనసేన నేతల ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్ధులను నిలపాలని జనసేన పార్టీ నాయకత్వంపై క్షేత్రస్థాయిలోని పార్టీ యువత ఒత్తిడి తెస్తోంది. దీంతో జనసేన నాయకత్వం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలా? లేక సమస్యలపై పోరాటానికే పరిమితం కావాలా అనే అయోమయంలో పడింది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టిసారించిన జనసేన , సమయం వచ్చినపుడు ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని స్పష్టం చేస్తామని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. రైతాంగ సమస్యలు, విద్యార్థి సమస్యలు , తాగునీటి సమస్యలు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై ఎప్పటికపుడు స్పందిస్తూ వస్తున్నా, ఎన్నికల్లో పోటీ విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గత కొద్ది రోజులుగా పార్టీ మేథోమథన సమావేశాల్లోనూ తెలంగాణలో యువత ఎక్కువగా జనసేన పక్షాన ఉన్నారని, ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా పార్టీని పటిష్టం చేసేందుకు మరింత అవకాశం దొరుకుతుందని జనసేన నేతలు చెబుతూ వస్తున్నారు. రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ విషయమై ఏదో ఒక స్పష్టత ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు, యువ నేతలు పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను కోరడంతో ఈ అంశంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుందామని ఆయన వారికి చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎన్నికల బరిలోకి దిగేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామంటూ పలువురు నేతలు ముందుకు వచ్చారు. అయితే తెలంగాణలో ఉన్న రాజకీయ సమీకరణల మధ్య జనసేన స్థానం ఏమిటనేది, రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తే వచ్చే ఓట్లు, సీట్లుపై పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఓట్లు ఎక్కువగా వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో, ఒక వేళ ఊహించిన మేరకు ఓట్లు రాకుంటే రానున్న రోజుల్లో పార్టీ భవితవ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. 2019 జూన్ వరకూ సమయం ఉందని , అంతలోగా పార్టీకి ఒక స్వరూపం ఇద్దామని పవన్‌కళ్యాణ్ నేతలకు చెప్పేలోగానే అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికల ప్రకటన రావడంతో జనసేన కు సన్నద్ధత సమస్య వస్తోంది. మిగిలిన పార్టీల మాదిరి బూత్ స్థాయి కమిటీలు ఇంకా ఏర్పాటు కాలేదు. గ్రామాల వారీ కార్యకర్తలు ఉన్నా, వివిధ కమిటీల ఏర్పాటు పూర్తికాకపోవడం కూడా పార్టీకి శాపంగా మారింది. తొలుత ఉన్న అంచనాల ప్రకారం తెలంగాణలో బాగా బలంగా ఉన్న కనీసం 23 నియోజకవర్గాల్లో , మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన భావించింది. అయితే తెలంగాణలో పరిస్థితి అంతగా సానుకూలంగా లేకపోవడంతో పార్టీ పోటీ చేసే అంశంపై సందిగ్ధత ఉందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అంగీకరించారు.