రాష్ట్రీయం

నేడు ప్రభుత్వంపై తిరుగుబాటు సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ‘ధర్మాగ్రహ సభ’ పేరుతో ఆదివారం మధ్యాహ్నం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ సభ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఈ సభను నిర్వహిస్తోంది. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ చొరవ తీసుకోవడంతో కొత్త జేఏసీ ఏర్పాటైంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఒక జేఏసీ ఉంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో, ప్రభుత్వం నుండి లాభాలను రాబట్టుకోవడంలో పాత జేఏసీ విఫలమైందని అందుకే కొత్త జేఏసీ ఏర్పాటు చేశామని కొత్త జేఏసీ కన్వీనర్లు సిహెచ్. సంపత్‌కుమార స్వామి, చాడారవి, భుజంగరావు, రాజేశం, కే. లక్ష్మయ్య తదితరులు చెప్పారు. 31 జిల్లాల నుండి దాదాపు 30 వేల మంది ఉద్యోగులు ఆదివారం జరిగే సభకు స్వచ్ఛందంగా వస్తున్నారని నిర్వహకులు వెల్లడించారు. ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వకపోవడం, పీఆర్‌సీ అమలు చేయడంలో జాప్యం చేయడం తదితర అంశాలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 42 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు, వీటిని సాదించుకునేందుకు సభ ద్వారా ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తామని నిర్వహకులు వివరించారు. పింఛనర్లకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వకపోవడం, 70 సంవత్సరాలు నిండిన పింఛనర్లకు 10 శాతం అధనపు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపిలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి తెలంగాణకు రప్పించాలన్నది మరో డిమాండ్. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.