రాష్ట్రీయం

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రాంరెడ్డి అస్తమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, నవంబర్ 10: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఎర్రబోతు రాంరెడ్డి (88) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రాంరెడ్డి మృతి వార్త తెలుసుకున్న ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, నాయకులు, గ్రామప్రజలు ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున అప్పాజిపేటకు తరలివచ్చారు. కాగా మాజీ మంత్రి, పీసీసీ మేనిఫెస్టో కమిటీ కో-చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి గుత్తా మోహన్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, టిఆర్‌యస్ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, బిజేపి నాయకులు కూతురు లక్ష్మారెడ్డి, సిపియం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. నల్లగొండ మండలం అప్పాజిపేటకు చెందిన రాంరెడ్డి బుచ్చిరెడ్డి సత్తెమ్మలకు మొదటి సంతానం. 1931లో జన్మించిన రాంరెడ్డి బాల్యమంతా సొంత గ్రామంలోనే గడిచింది. 4వతరగతి వరకు గ్రామంలోనే చదివి, 5నుండి 7తరగతులు నల్లగొండలోని మాల్‌బౌలీ ఉర్ధూ మీడియం స్కూల్‌లో చదువుకుంటూ రామగిరి హస్టల్‌లో ఉండేవాడు. ఈ క్రమంలోనే అంటే 1947లో 7వతరగతి చదివే రోజుల్లో కమ్యూనిస్టు ఆంధ్రమహాసభ నాయకులు, ధర్మభిక్షం ఉపన్యాసాలు, మీజాన్ పత్రిక కథనాలు, రోజురోజుకు దొరలు, రజకార్ల ఆగడాలు పెరిగిపోతుండటం, కడవెండి ఘటనలు ఉద్యమ బాట పట్టేలా చేశాయి. దీంతో ఎలాగైన తమ నిరసనలు తెలపాలని భావించిన రాంరెడ్డి మరికొందరు పాఠశాలలు, హాస్టళ్లు బంద్ చేసి జెండాలు ఎగురవేసి నిజాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యం చేయడం, తాటి చెట్ల పన్నులు కట్టవద్దని చెప్పేవారు.

చిత్రం..ఎర్రబోతు రాంరెడ్డి భౌతికకాయం