రాష్ట్రీయం

దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం చాలా కీలకమైనదని తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ దక్షిణా మూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో యువత ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా యువత ఆలోచనలను విద్యారంగంలోనూ, దేశాభివృద్ధిలోనూ భాగస్వామ్యం చేసే లక్ష్యంతోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో యువ సమ్మేళనాలను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. డిసెంబర్ 22, 23 తేదీల్లో యువకుంభ్ పేరుతో లక్నో నగరంలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీ మెకాస్టర్ ఆడిటోరియంలో యువ మిలాన్ పేరుతో సమ్మేళనం మొదలైంది. ఈ కార్యక్రమానికి అతిథిగా రామకృష్ణ మఠం సంచాలకులు చితికంఠానంద స్వామి , కాశీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ రాకేష్ కుమార్ ఉపాధ్యాయ, ప్రముఖ జర్నలిస్టు రాక సుధాకర్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ యువత ఆలోచనలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు లక్నోలో యువకుంభ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యారంగంలో, దేశాభివృద్ధిలో యువత ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని అనుసంథానించాలని, హిందూ జీవన విలువలను కాపాడాలనే లక్ష్యంతో ఈ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. స్వామి చితికంఠానంద మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితం యువతలో దేశం పట్ల స్వార్థ పూరిత ఆలోచనలు లేకుండా పనిచేసేట్టు ప్రేరేపిస్తుందని అన్నారు. స్వామీజీ జీవితాన్ని అందరూ చదవాలని, భారతదేశంలో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ ఎటువంటి పరిస్థితులు దాపురించినా, యువత తక్షణమే స్పందించాల్సి ఉందని అన్నారు. కార్యక్రమంలో యువసమ్మేళనం కన్వీనర్ అమర్‌నాధ్‌రెడ్డి, ఏబీవీపీ నేతలు మట్ట రాఘవేందర్, శ్రీహరి, సుమన్, శ్రీశైలం ఇతర విద్యార్థి నేతలు పాల్గొన్నారు.