రాష్ట్రీయం

నేడే నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రధానఘట్టం నేడు ప్రారంభమవుతోంది. శాసనసభ ఎన్నికలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ సోమవారం జారీ చేసేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ను గత నెల ఏడోతేదీనే వెల్లడించినప్పటికీ, అధికారికంగా నోటిఫికేషన్ జారీ అయితేనే ఎన్నికల కార్యక్రమం ఆరంభమవుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ శాసననసభకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలకు సోమవారం ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ జారీ కాగానే నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 19 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. దాఖలైన నామినేషన్లను డిసెంబర్ 20న పరిశీలిస్తారు. సరిగా లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. నామినేషన్లు సక్రమంగా ఉన్న అభ్యర్థుల పేర్లను 22న ప్రకటిస్తారు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు అభ్యర్థులు, పార్టీలు ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 7న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 11న కౌంటింగ్ జరుగుతుంది.