రాష్ట్రీయం

కక్ష సాధింపులొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 11: ‘రాజకీయంగా వైరుధ్యాలు సహజం. రాష్ట్ర ప్రజానీకం ఏం పాపం చేశారని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల పట్ల ఉన్న శ్రద్ధ ఏపీపై లేదా? కక్ష సాధింపు చర్యలు తగవు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఉండవల్లి ప్రజావేదికలోని తన ఛాంబర్‌లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి గంటకు పైగా ఏకాంత చర్చలు జరిపారు. ఈ భేటీలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి సందర్భంగా గవర్నర్ నేరుగా ఏపీ డీజీపీకి ఫోన్ చేసి వివరణ అడిగిన నేపథ్యంలో గవర్నర్ల వ్యవస్థపై జాతీయ స్థాయిలో చర్చ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి విదితమే. గత కొంతకాలంగా గవర్నర్‌కు ఆయన దూరంగా ఉంటున్నారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు అమరావతి వచ్చిన గవర్నర్‌ను విమానాశ్రయంలో కానీ, వేదిక వద్ద కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురేగి స్వాగతించక పోవటం గమనార్హం. సీనియర్ మంత్రులే ప్రొటోకాల్ బాధ్యతలు చేపట్టారు. ముందుగా కేబినెట్ విస్తరణ విషయమై ఏపీ సీఎంవో గవర్నర్ కార్యాలయానికి సమాచారం పంపింది. ఈమేరకు గవర్నర్ ఆదివారం అమరావతి చేరుకున్నారు. ఉదయం 9గంటలకే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఫిర్యాదు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన గవర్నర్ ముందుగా బీజేపీ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వటం విమర్శలకు దారితీసింది. ఇదిలావుండగా మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం అనంతరం గవర్నర్, సీఎంల ఏకాంత చర్చ సందర్భంగా జగన్‌పై దాడి, సిట్ దర్యాప్తు, తిత్లీ తుపాను సాయం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, ప్రత్యేక హోదా, విభజన అంశాల అమలులో నిర్లక్ష్యాన్ని ముఖ్యమంత్రి ప్రశ్నించినట్లు తెలిసింది. సీఎంఓ కార్యాలయం నుంచి తగిన వివరాలు సేకరించకుండానే కేంద్రానికి నివేదిక పంపటాన్ని కూడా చంద్రబాబు ఆక్షేపించినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ నేతల వ్యవహార శైలిపై కూడా గవర్నర్‌తో చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ కక్ష సాధింపులు పనికిరావని, మీరైనా కేంద్రానికి వివరించండని ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్‌ను కోరినట్లు తెలుస్తోంది. జగన్‌పై దాడి ఘటనలో నిందితుడు శ్రీనివాసరావు వైసీపీకే చెందినవాడని, దర్యాప్తునకు జగన్ సహకరించటం లేదని, విమానాశ్రయంలో జరిగిన సంఘటనలకు తమ ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయ రంగు పులుముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజకీయ పరిణామాలపై కూడా కొద్దిసేపు చర్చ జరిగింది. అనంతరం మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి, గవర్నర్ ఫొటోలు తీయించుకుని అల్పాహార విందు స్వీకరించారు. తిరిగి మధ్యాహ్నం 1.15 గంటలకు గవర్నర్ ఉండవల్లి నుంచి బయల్దేరి రెండు గంటలకు విజయవాడలో బసచేసిన హోటల్‌కు చేరుకున్నారు.
చిత్రం..గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు