రాష్ట్రీయం

ఆదిశేషునిపై శేషాచలపతి విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 11: నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయదేవేరులైన శ్రీదేవి, భూదేవీలతో కలిసి ఏడు పడగల పెద్ద శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. కాగా దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగులచవితిగా వ్యవహరిస్తారు. శ్రావణ శుద్ధ చతుర్థినాడు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. పురాణ ప్రాశస్త్యం మేరకు సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా, పాదుకలు, శయ్యగా, ఛత్రంగా, రామరూపియై వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా స్వామివారికి సేవలందిస్తాడు. అంతేకాకుండా రామావతారంలో లక్ష్మణునిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు సేవకులలో ఆద్యుడు. స్వామివారి దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషువుపై ఉభయ దేవేరులతో కూడి భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని సాక్షాత్కరింపజేశారు.

చిత్రం..పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవిలతో కలిసి ఊరేగుతున్న స్వామివారు