రాష్ట్రీయం

కేంద్రంపై ఒత్తిడి పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల మేరకు రూ 58వేల కోట్లతో ప్రతిపాదనలు సమర్పించగా, ఇప్పటి వరకు రాష్ట్రప్రభుత్వం ఖర్చుపెట్టిన నిధులతో పాటు రెండవ డీపీఆర్‌ను అనుమతించే విషయంలో జరుగుతున్న జాప్యం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చుచేసిన మొత్తాన్ని చెల్లించేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జలవనరులశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటి వరకు రూ. 3వేల 161 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ తుది అంచనాల ఖరారుకు కేంద్ర జలసంఘంతో మంగళవారం రాష్ట్ర జలవనరుల అధికారులు చర్చించనున్న నేపథ్యంలో ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని అనుమతులు సాధించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. వచ్చే ఏడాది మే 15వ తేదీకల్లా కీలకమైన కాఫర్‌డ్యామ్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని గడువు విధించారు. సోమవారం సచివాలయంలో పోలవరం , ఇతర ప్రాధాన్యతా ప్రాజెక్ట్‌ల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి 81వ వర్చువల్ రివ్యూ నిర్వహించారు. గత వారం దీపావళి
కావటంతో నిర్దేశించిన పనుల లక్ష్యంలో కొంత వెనుకబడినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాజెక్ట్ మొత్తం 60.66 శాతం పూర్తి కాగా, తవ్వకం పనులు 80.50శాతం, కాంక్రీట్ పనులు 47శాతం పూర్తయ్యాయని చెప్పారు. కుడి ప్రధాన కాలువ పనులు 90 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 65.30శాతం జరిగాయన్నారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.92 శాతం పూర్తయిందని చెప్పారు. గత వారం స్పిల్‌చానల్, స్పిల్‌వే, పైలెట్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ప్లాంక్‌కు సంబంధించి 4.56 లక్షల క్యూబిక్‌మీటర్ల మేర తవ్వకం పనులు, స్పిల్‌వే, స్పిల్‌చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 51వేల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు పూర్తయినట్లు వివరించారు.
కాగా పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకు నిర్మిస్తున్న కాలనీలకు సంబంధించి గత వారంలో రూ 2.89 కోట్లతో 12 శాతం పనులు పూర్తిచేశామని అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 17 కాలనీలకు సంబంధించి గతవారం నిర్దేశించుకున్న లక్ష్యంలో 34 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మిస్తున్న 29 కాలనీలకు నిర్దేశించిన లక్ష్యంలో 69శాతం పనులు పూర్తయ్యాయని సీఎం దృష్టికి తెచ్చారు. మరోవైపు పర్యావరణ అనుకూలత, స్వయం సమృద్ధి సాధించేలా పోలవరం ముంపు ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు ప్రవాస తెలుగువారికి చెందిన ఫార్చూన్ 100 సంస్థ ముందుకొచ్చింది. త్వరలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని పైలెట్ ప్రాజెక్ట్‌గా పనులు చేపడతామని సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. సమీక్షా సమావేశంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జీ సాయిప్రసాద్, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, సీఎంఒ అదనపు కార్యదర్శి ఏవీ రాజవౌళి, పోలవరం ఆర్ అండ్ ఆర్ కమిషనర్ రేఖారాణి, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
చిత్రం..ప్రాజెక్ట్‌లపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు