రాష్ట్రీయం

ఉద్రిక్తతల నడుమ చత్తీస్‌గఢ్ తొలి దశలో భారీ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 12: మావోయిస్టుల కోటలో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ ముగిసింది. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సోమవారం ఎనిమిది జిల్లాలోని 18 నియోజకవర్గాలకు జరిగిన తొలిదశ పోలింగ్ మావోయిస్టులకు, పోలీసుల పోరాటం మధ్య ముగిసింది. బీజాపూర్ జిల్లాలోని పామేడు సమీపంలో కోబ్రా దళాలకు, మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోలు మృతి చెందగా ముగ్గురు కోబ్రా కానిస్టేబుళ్ళకు తీవ్ర గాయాలు కావడంతో హెలికాప్టర్ ద్వారా రాయపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు దంతెవాడ జిల్లాలోని ద్వారపర పోలింగ్ బూత్ వద్ద మావోలు ఐఇడిని పేల్చివేశారు. మరో ఐదు ఐఇడిలను పోలీసులు పసిగట్టి నిర్వీర్యం చేశారు. చాలా నియోజకవర్గాల్లో పోలీసులు, మావోలకు ఆధిపత్య పోరు సాగుతున్నప్పటికీ 70 శాతం మంది ప్రజలు
తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 10 స్థానాల్లో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగ్గా మిగిలిన ఎనిమిది స్థానాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎనిమిది జిల్లాల పరిధిలోని 32 లక్షల మంది ఓటర్లకు 4,336 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. దాదాపు లక్ష మంది పోలీసులను, 17 హెలికాప్టర్లను ఈ ఎన్నికలకు ఉపయోగించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ పోటీ చేసిన రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గంలో కూడా సోమవారం ఎన్నిక పూర్తయింది. ఈ నియోజకవర్గంలో 2008, 2014లో రమణ్‌సింగ్ గెలవగా, ప్రస్తుతం ఆయనపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీజేపీ అగ్రనేత దివంగత వాజ్‌పాయ్ మేనకోడలు శుక్లా పోటీ చేస్తున్నారు. బస్తర్ డివిజన్‌లో కమల కళాశాల బూత్‌లో పోలింగ్ నిలిచిపోగా 53 చోట్ల ఆలస్యంగా నడిచింది. పామేడు సమీపంలో రెండుచోట్ల చెట్ల కిందనే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. సరాసరిన ప్రతి 37 మంది ఓటర్లకు ఒక పోలీస్ ఉండేలా బందోబస్తు ఏర్పాటు చేశారు.

చిత్రం..సుక్మా జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు