రాష్ట్రీయం

కామన్ మేనిఫెస్టోకు కూటమి కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక(కామన్ మేనిఫెస్టో) కోసం మహాకూటమి భాగస్వామ్యపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క నివాసంలో కూటమి నేతలు విస్తృతంగా చర్చలు జరిపారు. భట్టివిక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రణాళికపై వారు సుదీర్ఘంగా చర్చించారు. తిరిగి మంగళవారం సమావేశం కావాలని నిర్ణయించారు.
పోటీ ఎక్కడో నిర్ణయించుకోలేదు
ఇలాఉండగా టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా కూటమిలో సీపీఐని కలుపుకుని పోతామని అన్నారు. టీజేఎస్ అభ్యర్థులను మంగళవారం ప్రకటిస్తామని ఆయన తెలిపారు. తమ పార్టీ 8 లేదా అంత కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందన్నారు. పార్టీ గుర్తు గురించి విస్తృత ప్రచారం చేస్తామని వివరించారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం జరగలేదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.