రాష్ట్రీయం

బీఎల్‌ఎఫ్‌లోకి వస్తే సీపీఐకి కోరిన సీట్లు ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 12: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ భ్రష్టు పట్టిందని, అటువంటి పార్టీతో సీపీఐ జత కట్టడం దురదృష్టకరమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. భద్రాచలంలో బీఎల్‌ఎఫ్ బలపర్చిన సీపీఎం అభ్యర్థి మిడియం బాబూరావు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కార్యకర్తలతో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పాలన చూసిన ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు చూస్తున్నారన్నారు. సీపీఐని అనేకసార్లు బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌తో కలిసి ముందుకు సాగాలని కోరామని, అయితే తమను ఆహ్వానించలేదని సీపీఐ నేతలు పేర్కొనడం సరికాదన్నారు. అప్పుడు, ఇప్పుడు సీపీఐతో ఒకేలా ఉన్నామని, ఇప్పుడు కలిసొచ్చినా కోరిన సీట్లు ఇస్తామన్నారు. కోదండరామ్ స్థాపించిన తెలంగాణ జన సమితి పార్టీ కూడా బీఎల్‌ఎఫ్‌తో కలిసి రావాలని, ఆశించిన సీట్లు ఇస్తామన్నారు. పౌర హక్కుల నేతగా ఉంటానన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక బూటకపు ఎన్‌కౌంటర్లతో తెలంగాణను రక్తసిక్తం చేశారని విమర్శించారు. బంగారు తెలంగాణను బాధల తెలంగాణగా మార్చిన కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు.
కేంద్రంలో మోదీ అనుసరిస్తున్న విధానాలతో నాలుగేళ్లలో 1.12 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతే, తెలంగాణలో 2.50 లక్షల ఖాళీల్లో నాలుగున్నరేళ్లలో 23 వేల ఉద్యోగాలనే కేసీఆర్ భర్తీ చేసి నిరుద్యోగాన్ని పెంచి పోషించారన్నారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో లోతుగా ఆలోచించి బతుకులు బాగు చేసే వారికే ఓటు వేయాలని తమ్మినేని కోరారు.