రాష్ట్రీయం

ఆ ఘనత బాబుదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 12: రాష్ట్రంలో తొలిసారిగా 12 కులాలకు ఫెడరేషన్లను ఏర్పాటు చేసి వాటికి పాలకవర్గాలను నియమించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందంటూ స్థానిక మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన ‘పేదరికంపై గెలుపు’ సభలో వివిధ ఫెడరేషన్ల చైర్మన్‌లు ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్‌లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు లబ్ధిదారులకు 285 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. బ్రాహ్మణ సంక్షేమం కోసం 1500 యూనిట్లను గ్రౌండింగ్ చేశామన్నారు. భారతీయ విద్యా పథకం ద్వారా ఒకటి నుండి విదేశీ విద్య వరకు ప్రభుత్వమే ఖర్చు చేస్తుందన్నారు. రాబోయే 4 మాసాల్లో 50 శాతం సబ్సిడీతో 400 మందికి రుణాలు మంజూరు చేస్తామన్నారు. మహిళా సాధికారిత కోసం సొసైటీల ద్వారా కృషి చేస్తుందన్నారు. ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాల్ మాట్లాడుతూ కుల, చేతి వృత్తుల వారికి 5 లక్షల మందికి నాలుగు దశల్లో ఆదరణ పథకం ద్వారా పనిముట్లను అందిస్తున్నామన్నారు. కల్లుగీత కార్మిక ఫెడరేషన్ అధ్యక్షులు తాతా జయప్రకాష్ మాట్లాడుతూ కల్లుగీత కార్మికులు 32వేల మందికి సైకిళ్ళుతో పాటు ఐదువేలు నగదును అందిస్తున్నారన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది లబ్ధిదారులకు ఉపకరణాలు అందిస్తూ దివంగత ఎన్టీఆర్ ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెడుతున్నారన్నారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ హిదాయత్ మాట్లాడుడూ పేదరికంపై గెలుపే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పని చేస్తున్నారన్నారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకతతో పథకాలను పేదలకు అందిస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ముస్లింల సంక్షేమానికి 2వేల 800కోట్ల ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రం నెం.1గా కేంద్రంలోను, ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ, ఎంబీసీలు అందరికీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంక్షేమ పథకాలను అందించాలన్నారు. ముఖ్యమంత్రి పోలవరానికి ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారో సంక్షేమ పథకాలకు కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ సమీక్షలను నిర్వహిస్తున్నారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ పేదరికంపై గెలుపు ఒక ఉద్యమంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టారన్నారు. ప్రతి కుటుంబం పదివేల రూపాయలు సంపాదించి ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి చేయూతనిస్తున్నారన్నారు. బీసీ కార్పొరేషన్ ముఖ్య కార్యదర్శి బి ఉదయలక్ష్మి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు రాష్ట్రంలోని 52 రెవెన్యూ డివిజన్లలో ఆదరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. లక్ష మంది లబ్ధిదారులకు 750 కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. మరో మూడు విడతల్లో మిగిలిన లబ్దిదారులందరికీ ఆదరణ ద్వారా కుల, చేతి వృత్తుల సంబంధించిన యంత్ర పరికరాలను అందిస్తామన్నారు.