రాష్ట్రీయం

ఢిల్లీలో కాంగ్రెస్ వలస నేతల మకాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 12: ఎన్నికల బరిలోకి దిగి తమ అదృష్ఠాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ ఆశావహులు ఎలాగైనా టిక్కెట్ దక్కించుకుకోవాలనే ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే తొలి జాబితా సిద్ధమైనట్టు అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో, ఆ జాబితాలోనే తమ పేరును చేర్చాల్సిందిగా ముఖ్య నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రధానంగా టిక్కెట్ ఎలాగూ తమకే ఖరారవుతుందనే గట్టి నమ్మకంతో కాంగ్రెస్‌లోకి చేరిన వలస నేతలు ప్రస్తుత తుది సమయంలో నేరుగా అధిష్ఠానం పెద్దలను కలిసి ఒప్పించేందుకు గత కొద్దిరోజుల నుండి ఢిల్లీలోనే మకాం వేసి తుదికంటా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుండి అభ్యర్థిత్వాలపై గంపెడాశలు పెట్టుకున్న ఇద్దరు వలస నాయకులు లాబీయింగ్ యత్నాల్లో నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్మూర్ నుండి ఇదివరకటి ఓయూ విద్యార్థి నేత రాజారాంయాదవ్ టిక్కెట్‌ను ఆశిస్తుండగా, ఎమ్మెల్సీ ఆకుల లలిత ఇప్పటికే గత పక్షం రోజుల ముందునుండే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తనకు హైకమాండ్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే అధికారిక ప్రకటనకు ముందే ప్రచార బరిలోకి దిగినట్టు ఆమె ధీమా వెలిబుచ్చుతున్నారు. అయితే కాంగ్రెస్ టిక్కెట్‌ను ఆశిస్తూ తెదెపాకు రాజీనామా చేసి ఆ పార్టీలో చేరిన రాజారాంయాదవ్‌కు ఈ పరిణామం మింగుడుపడని వ్యవహారంలా మారింది. ఆకుల లలితకు పోటీగా రాజారాంయాదవ్ కూడా ఒకటిరెండు రోజుల పాటు సెగ్మెంట్‌లో ప్రచారం చేసినప్పటికీ, లలితకే టిక్కెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే సంకేతాలు వెలువడడంతో అధిష్ఠానం పెద్దలను మచ్చిక చేసుకునే పనిలోపడ్డారు. హైదరాబాద్‌లో ముమ్మర ప్రయత్నాలు చేసిన ఆయన, ప్రస్తుతం ఢిల్లీకి మకాం మార్చి హైకమాండ్ పెద్దలను ఒప్పించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే బాటలో నిజామాబాద్ రూరల్ నుండి టిక్కెట్‌ను ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి కూడా ఢిల్లీకి చక్కర్లు కొడుతూ అభ్యర్థిత్వాన్ని ఎలాగైనా తనకే ఖరారు చేసుకోవాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. రూరల్ సెగ్మెంట్‌ను మహాకూటమి పొత్తు ఒప్పందంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తారనే ప్రచారం నిన్నమొన్నటి వరకు జరిగింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఎన్నికల బరిలోకి దిగనున్నారని అనుచరులు చెబుతూ వచ్చారు. అయితే పోటీకి మండవ సుముఖత వ్యక్తపర్చని కారణంగా రూరల్ టిక్కెట్‌ను ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన తెరాస అసమ్మతి నేత, ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.్భపతిరెడ్డికి కేటాయించనున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో ఆయన కంటే ముందే రూరల్ టిక్కెట్‌ను ఆశిస్తూ తెదెపాకు గుడ్‌బై చెప్పి తెరాసలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి టిక్కెట్ వేటను ముమ్మరం చేశారు. ఢిల్లీలో మకాం వేసి ఏఐసీసీ పెద్దలను ఒప్పించే పనిలో పడ్డారని తెలుస్తోంది.