రాష్ట్రీయం

మహాకూటమితో టీఆర్‌ఎస్ నేతల్లో గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 12: మహాకూటమికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి టీఆర్‌ఎస్ నేతల్లో గుబులు మొదలైందని, దానిని తట్టుకోలేక కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి పేర్కొన్నారు. మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండలం రావినూతలలో సోమవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, దొరలను ముందు నమ్మారని, తరువాత మోసం చేసిన వారిని తరిమికొట్టిన చరిత్ర ఉన్నదన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేస్తే తమకు డిపాజిట్లు రావనే భయంతో, అసహనంతో ఆరోపణలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బుతో ఏమైనా చేయవచ్చనే టీఆర్‌ఎస్ నేతల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, డిసెంబర్ 7వ తేదీన ఓటింగ్‌లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణ ప్రజలు సేవచేసిన వారిని గుర్తుంచుకుంటారని, మోసంచేసిన వారిని ఎదిరించే ధీరులని వెల్లడించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కలయికను అపవిత్ర కలయికగా ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. నాడు తెలుగుదేశం పార్టీతో కలిసి టీఆర్‌ఎస్ పోటీ చేస్తే లేని తప్పు ఇప్పుడు ఎందుకు వచ్చిందని పేర్కొన్నారు. కేవలం దేశ ప్రయోజనాల కోసం లౌకిక పార్టీలన్ని ఒకే వేదికపైకి వస్తున్నాయన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్ నియంతలా పాలిస్తున్నారని, ఐదేళ్ళు పాలించమని ప్రజలు నమ్మి ఓటేస్తే పాలించలేక ముందస్తుగానే ఎన్నికలకు వెళ్ళిన నేతను ప్రజలు తరిమికొట్టాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక చోట్ల టీఆర్‌ఎస్ నేతలను గ్రామాల్లోకి రానివ్వడంలేదని స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ పేరుతో ఐదులక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనుడు కెసిఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో భాగంగానే మహాకూటమి ఏర్పడిందని, దేశవ్యాప్తంగా దీనిని అన్ని రాష్ట్రాలలో విస్తరిస్తామన్నారు. చంద్రబాబునాయుడు దేశ రాజకీయాల్లో తనదైన శైలిలో బిజెపి వ్యతిరేక కూటమి నిర్మాణంలో కీలకపాత్ర పోషించి పెనుమార్పులు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని తమ జాగీరుగా మార్చి దోచుకున్నారన్నారు. మహాకూటమి అధికారంలోకి రాగానే ఏకకాలంలో రెండులక్షల రుణమాఫీ, పంటకు మద్దతుధర, ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు ఒక్కో సంఘానికి పదిలక్షల చొప్పున వడ్డీలేని రుణం, ఆరు ఉచిత సిలిండెర్లు, ఇప్పుడున్న పెన్షన్ల రెట్టింపు, నిరుద్యోగుల కోసం మూడువేల బృతి, లక్షకు పైగా ఉద్యోగాల కల్పన, 18ఏళ్ళు నిండిన వారందరికి ఐదులక్షల ఉచిత ప్రమాద బీమా, ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య సేవలు అందిస్తామన్నారు. అర్హులైన వారందరికి ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు అందజేస్తామన్నారు.
నాడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల హయాంలో జరిగిన అభివృద్ధి మినహా నాలుగున్నరేళ్ళలో జరిగిందేమి లేదని, లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువచ్చారని దుయ్యబట్టారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతలు సమన్వయంతో పనిచేయడం ద్వారా మహాకూటమిని గెలిపించాలన్నారు.